మురళీధరన్‌ బయోపిక్‌: సేతుపతి కంటే ముందు ఆ స్టార్ హీరోను సంప్రదించారా..!

శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్‌ బయోపిక్‌పై పెద్ద వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఇందులో నటించేందుకు విజయ్ సేతుపతి ఓకే చెప్పగా

  • Tv9 Telugu
  • Publish Date - 11:51 am, Tue, 27 October 20
మురళీధరన్‌ బయోపిక్‌: సేతుపతి కంటే ముందు ఆ స్టార్ హీరోను సంప్రదించారా..!

Muttiah Muralitharan biopic: శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్‌ బయోపిక్‌పై పెద్ద వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఇందులో నటించేందుకు విజయ్ సేతుపతి ఓకే చెప్పగా.. 800 పేరుతో మోషన్‌ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో.. మురళీధరన్ కోరిక మేరకు సేతుపతి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. అయితే ఈ మూవీ కచ్చితంగా ఉంటుందని మురళీధరన్ స్పష్టం చేశారు. అందులో ఎవరు నటిస్తారు..? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది..? అనే విషయాలను మళ్లీ చెబుతామని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే ఈ వివాదాస్పద మూవీకి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు కోలీవుడ్‌ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఇందులో నటించేందుకు ముందుగా ధనుష్‌ని సంప్రదించారట. అయితే ధనుష్‌ ఆ ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించారట. ఆ తరువాత అసురన్‌లో ధనుష్‌ పెద్ద కొడుకుగా నటించిన తీజయ్‌ని కూడా కలిసినట్లు సమాచారం. కానీ అతడు కూడా నో చెప్పినట్లు టాక్‌. ఆ తరువాత సేతుపతిని కలిసినట్లు ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక యువ వయస్సులో ఉన్న మురళీధరన్ పాత్ర కోసం కమెడియన్ కుమారుడు కెన్‌ కరునాస్‌ సంప్రదించారని, ఆ పాత్రను అతడు తిరస్కరించాడని టాక్‌. మరి ఈ ప్రాజెక్ట్‌లో ఫైనల్‌గా ఎవరు నటిస్తారో చూడాలి.

Read More:

వారిని బేషరతుగా విడుదల చేయండి.. చిత్తూరు జిల్లా ఎస్పీకి బాబు లేఖ

ఉపాధ్యాయుల కృషికి గుర్తింపు.. ఆరో స్థానంలో భారత్‌