వారిని బేషరతుగా విడుదల చేయండి.. చిత్తూరు జిల్లా ఎస్పీకి బాబు లేఖ

చిత్తూరు జిల్లాలో టీడీపీ నేతల గృహ నిర్బంధాలను నిరసిస్తూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లా ఎస్పీకి లేఖ రాశారు.

  • Manju Sandulo
  • Publish Date - 11:19 am, Tue, 27 October 20

Chandrababu Naidu TDP: చిత్తూరు జిల్లాలో టీడీపీ నేతల గృహ నిర్బంధాలను నిరసిస్తూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. శాంతియుత ఆందోళన ద్వారా సాగునీటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న తమ నాయకులను హౌజ్ అరెస్ట్ చేయడం.. రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాయడమేనని చంద్రబాబు ఆ లేఖలో మండిపడ్డారు. అక్రమ నిర్బంధాలను గురైన వ్యక్తులను బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజ్యాంగ వ్యతిరేక, అప్రజాస్వామిక అరెస్ట్‌లకు స్వస్తి పలకాలని, ప్రజాస్వామ్య విస్తృత ప్రయోజనాలను కాపాడాలని ఆయన అన్నారు. ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చడం ప్రభుత్వ కనీస బాధ్యత అని, కానీ ప్రభుత్వానికి వాటికంటే వేరే ఇతర ప్రాధాన్యాంశాలు ఉన్నట్లు కనిపిస్తోందని ఆ లేఖలో పేర్కొన్నారు.

అయితే హంద్రీనీవా ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి చిత్తూరు జిల్లాకు నీరు తీసుకురావాలని కోరుతూ రామకుప్పం మండలంలో టీడీపీ నేతలు సోమవారం పాదయాత్ర చేపట్టారు. దీన్ని అడ్డుకున్న పోలీసులు పార్టీ నేతలు, కార్యకర్తలను గృహ నిర్బంధం చేశారు. ఈ ఘటనను బాబు తీవ్రంగా ఖండించారు.

Read More:

ఉపాధ్యాయుల కృషికి గుర్తింపు.. ఆరో స్థానంలో భారత్‌

అవి లేకుండా అన్నయ్యను నేనే చూడలేదు.. ఫ్యాన్స్‌కి వినాయక్ భరోసా