Rajeshwari Ray Mahapatra Death: టీవీ ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో టీవీ నటి మృతి

భువనేశ్వర్‌లోని కాన్ఫిడెన్షియల్ ఎమర్జెన్సీ కమ్యూనిటీలో చికిత్స పొందుతూ మరణించింది. ఆమె ఏప్రిల్ 2019 నుంచి మెదడు, ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్‌తో బాధపడుతోంది.

Rajeshwari Ray Mahapatra Death: టీవీ ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో టీవీ నటి మృతి
Rajeshwari Ray Mahapatra

Updated on: Jul 21, 2022 | 10:17 PM

Rajeshwari Ray Mahapatra Death: సినీ పరిశ్రమలో​మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ టీవీ నటి రాజేశ్వరి రే మహాపాత్ర క్యాన్సర్‌ వ్యాధితో కన్నుమూశారు. గురువారం భువనేశ్వర్‌లోని కాన్ఫిడెన్షియల్ ఎమర్జెన్సీ కమ్యూనిటీలో చికిత్స పొందుతూ మరణించింది. ఆమె ఏప్రిల్ 2019 నుంచి మెదడు, ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్‌తో బాధపడుతోంది.

రాజేశ్వరి స్వాభిమాన్ మరియు ఉన్సి కన్య వంటి ఒడియా టీవీ షో సిరీస్‌లలో నటించింది. నెగిటివ్ రోల్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న రాజేశ్వరి సత్యమేవ జయతే, హే సాథీ వంటి చిత్రాలలో నటించింది.కొంతకాలంగా మెదడు, ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమె మరణవార్తతో ఒడియా సిని పరిశ్రమలో విషాదం నెలకొంది.

ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు టీవీ, సినీ నటీనటులు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా తాను క్యాన్సర్‌తో పోరాడుతున్నానంటూ 2019లో రాజేశ్వరీ రే ఫేస్‌బుక్‌లో ఎమోషనల్‌ నోట్‌ షేర్‌ చేశారు. దీంతో తను త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ ఆమె ఫ్యాన్స్‌ ప్రార్థించారు. కాగా ‘స్వాభిమానం’ అనే ఒడియా సీరియల్‌తో మహాపాత్ర మంచి గుర్తింపు పొందారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి