ఛాలెంజ్‌ స్వీకరించిన ఎన్టీఆర్.. చిరు, బాలయ్యతో పాటు వారికి సవాల్..!

| Edited By:

Apr 21, 2020 | 11:14 AM

లాక్‌డౌన్ వేళ ‘బీ ద రియల్ మ్యాన్’ చాలెంజ్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారుతోంది. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రారంభించిన ఈ ఛాలెంజ్‌ను ఇప్పుడు పలువురు స్వీకరిస్తున్నారు. ఇంటి పనుల్లో భార్యకు సహాయం చేయడమే ఈ ఛాలెంజ్‌ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఇక సందీప్ నుంచి ఈ సవాల్‌ను స్వీకరించిన రాజమౌళి.. ఆ తరువాత రామ్ చరణ్‌, ఎన్టీఆర్, సుకుమార్, శోభు యార్లగడ్డ, కీరవాణిలకు ఛాలెంజ్‌ విసిరారు. తాజాగా జక్కన్న విసిరిన […]

ఛాలెంజ్‌ స్వీకరించిన ఎన్టీఆర్.. చిరు, బాలయ్యతో పాటు వారికి సవాల్..!
Follow us on

లాక్‌డౌన్ వేళ ‘బీ ద రియల్ మ్యాన్’ చాలెంజ్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారుతోంది. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రారంభించిన ఈ ఛాలెంజ్‌ను ఇప్పుడు పలువురు స్వీకరిస్తున్నారు. ఇంటి పనుల్లో భార్యకు సహాయం చేయడమే ఈ ఛాలెంజ్‌ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఇక సందీప్ నుంచి ఈ సవాల్‌ను స్వీకరించిన రాజమౌళి.. ఆ తరువాత రామ్ చరణ్‌, ఎన్టీఆర్, సుకుమార్, శోభు యార్లగడ్డ, కీరవాణిలకు ఛాలెంజ్‌ విసిరారు. తాజాగా జక్కన్న విసిరిన ఆ సవాల్‌ను ఎన్టీఆర్ స్వీకరించారు. ఇంట్లో పనులు చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.  ఆ తరువాత  ఈ ఛాలెంజ్‌ కోసం చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్, కొరటాల శివలను ఎన్టీఆర్ నామినేట్ చేశారు.

Read This Story Also:  రజనీకి విలన్‌గా గోపిచంద్.. మ్యాచో హీరో ఏమన్నారంటే..!