Nora Fatehi: కేజీఎఫ్‌2 కోసం బాహుబలి ‘మనోహరి’.. స్పెషల్‌ సాంగ్‌గా అలనాటి క్లాసిక్‌ సాంగ్ రీమిక్స్‌..

|

Feb 08, 2022 | 9:22 AM

కన్నడ రాక్‏స్టార్ యశ్ (Yash) ప్రధాన పాత్రలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన 'కేజీఎఫ్' (KGF) చిత్రం బ్లాక్ బస్టర్‏గా నిలిచిన సంగతి తెలిసిందే.

Nora Fatehi: కేజీఎఫ్‌2 కోసం బాహుబలి మనోహరి.. స్పెషల్‌ సాంగ్‌గా అలనాటి క్లాసిక్‌ సాంగ్ రీమిక్స్‌..
Follow us on

కన్నడ రాక్‏స్టార్ యశ్ (Yash) ప్రధాన పాత్రలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘కేజీఎఫ్’ (KGF) చిత్రం బ్లాక్ బస్టర్‏గా నిలిచిన సంగతి తెలిసిందే. అప్పటివరకు కేవలం కన్నడ స్టార్ హీరోగా ఉన్న యశ్.. ఈ సినిమాతో పాన్ ఇండియా సూపర్ స్టార్‏గా మారిపోయాడు. డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) రేంజ్ కూడా ఒక్కసారిగా మారిపోయింది. కాగా కేజీఎఫ్ సినిమాకు సీక్వెల్‏గా వస్తున్న ‘కేజీఎఫ్-2’ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్‏కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. కాగా ‘కేజీఎఫ్-2’‌లో బాలీవుడ్ తారలు సంజయ్ దత్, రవీనా టండన్ కీలక పాత్రలు పోషిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ బాలీవుడ్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతోంది. అదేంటంటే.. బాహుబలి ‘మనోహరి’ నోరా ఫతేహి (Nora Fatehi) ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో కనువిందు చేయనుందట.

‘షోలే’ సాంగ్ రీమిక్స్..

కాగా కేజీఎఫ్‌ మొదటి భాగంలో జాకీ ష్రాఫ్ హీరోగా తెరకెక్కిన ‘త్రిదేవ్’ చిత్రంలోని ‘గలీ గలీ మేన్ ఫిర్తా’ పాటను రీమేక్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో నాగిన్‌ బ్యూటీ మౌనీరాయ్‌ తనదైన స్టెప్పులతో ఉర్రూతలూగించింది. ఈక్రమంలోనే కేజీఎఫ్‌2 లో స్పెషల్ సాంగ్‌ కోసం నోరాను రంగంలోకి దింపుతున్నారట దర్శక నిర్మాతలు. ఇందుకోసం అలనాటి బాలీవుడ్ హిట్ సాంగ్‌ను రీమేక్‌ చేశారని వినికిడి. అమితాబ్‌ హీరోగా నటించిన ఇండస్ట్రీ హిట్‌ ‘షోలే’ సినిమా లోని ‘మెహబూబా..మెహబూబా’ పాటను రీమిక్స్ చేశారని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న ఈపాటను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా భారీ బడ్జెట్‏తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘కేజీఎఫ్‌2’ గతేడాది విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతుండడంతో ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకొచ్చేందుకు ప్రయత్ని్స్తున్నారు దర్శక నిర్మాతలు.

Also Read:Murder: కట్నం తీసుకురాలేదని.. యాసిడ్ తాగించి చంపేశారు

Top 9 News: తెలుగు రాష్ట్రాల ట్రెండింగ్ వార్తలు.. పొలిటికల్ న్యూస్ సమాహారం “టాప్ 9 న్యూస్” (వీడియో)

News Watch LIVE : ఇప్పుడు…కేసీఆర్ యాదాద్రికి మోదీని ఆహ్వానిస్తారా..? మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్..(వీడియో)