Nora Fatehi: బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి మరో అరుదైన అవకాశాన్ని చేజిక్కించుకుంది. తన డ్యాన్స్ మూవ్స్, స్టన్నింగ్ లుక్స్‌తో ఆడియన్స్‌లో ఫుల్ క్రేజ్ సంపాదించింది. స్పెషల్ సాంగ్స్‌తో మిలియన్ హార్ట్స్ గెలుచుకున్న భామ డ్యాన్స్ మాత్రమే కాదు యాక్టింగ్ స్కిల్స్‌తోనూ బాలీవుడ్ అటెన్షన్‌ను క్యాచ్ చేసింది. ఈ క్రమంలో అజయ్ దేవగన్ ‘భుజ్ : ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’లో చాన్స్ దక్కించుకుంది.
ఈ హిస్టారికల్ వార్ డ్రామాలో లీడ్ రోల్ చేయబోతున్న విషయంపై తాజాగా స్పందించిన నోరా.. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రల కోసం ఎదురుచూస్తున్న తనకు ఈ క్యారెక్టర్ లభించడం ఆనందంగా ఉందని తెలిపింది. ఈ అవకాశంతో తన యాక్టింగ్ పొటెన్షియల్ చూపించగలనని అభిప్రాయపడింది. సినిమాలో తన క్యారెక్టర్ పవర్‌ఫుల్‌గా ఉంటుందని, తెరపై తనను చూశాక ప్రజలు గౌరవిస్తారని తెలిపింది. కాగా ఎప్పుడూ మోడ్రన్ దుస్తుల్లో కనిపించే నోరా.. ఈ చిత్రంలో ట్రెడిషనల్ లుక్‌లో మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతోంది.
Sister Andre: కరోనాను ఓడించిన 116 ఏళ్ల బామ్మ.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వృద్ధురాలు..