Nithin: యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న సినిమా మాచర్ల నియోజకవర్గం (Macherla Niyojakavargam). ఎంఎస్. రాజశేఖ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నితిన్‌కు జోడిగా కృతీ శెట్టి (Krithi Shetty), క్యాథెరీన్ థెరిస్సా (Catherine Tresa) నటిస్తున్నారు. 2020లో వచ్చిన భీష్మా తర్వాత మళ్లీ ఆ స్థాయి విజయాన్ని అందుకోలేక పోయిన నితిన్ ఈసారి ఎలాగైనా భారీ విజయాన్ని అందుకోవాలని రంగంలోకి దిగాడు. అందుకే పక్కా మాస్ చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో నితిన్ ఐఎస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నాడు. అయితే మాస్ ఎలిమేంట్స్‌కు ఏమాత్రం కొదవలేదని గతంలో విడుదల చేసిన ఫస్ట్ లుక్ చెప్పకనే చెప్పేసింది.
ఇదిలా ఉంటే ఈరోజు (బుధవారం) నితిన్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ సినిమా టీజర్‌ను విడుదల చేసింది. ‘ఫస్ట్ అటాక్’ పేరుతో విడుదల చేసిన ఈ విడుదల ఆకట్టుకుంటోంది. 47 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్ మాస్ ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. నితిన్ మరోసారి ఫుల్ లెంత్ యాక్షన్ సినిమాతో ఫ్యాన్స్ ముందుకు రానున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైనమెంట్స్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్లపై ఎన్.సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సినిమా నితిన్ కెరీర్‌ను ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.
Also Read: IPL 2022: కేన్ మామకు మరోషాక్.. ఆ విషయంలో రోహిత్ సరసన.. ఇదే రిపీటైతే ఇద్దరిపై వేటే?
Viral Photo: ఈ ఫోటోలో పామును కనిపెడితే మీరే జీనియస్.. ఈజీగా కనిపెట్టొచ్చండోయ్.!