Nimrat Kaur: విమాన ప్రయాణంలో నటి నిమ్రత్ కౌర్‌కు చేదు అనుభవం.. అమెరికా ఎయిర్‌లైన్స్‌పై ఫైర్

|

Aug 27, 2022 | 2:40 PM

Nimrat Kaur: సినీ నటి నిమ్రత్ కౌర్‌కు విమాన ప్రయాణంలో చేదు అనుభవం ఎదురయ్యింది. ఆమె లగేజీ మిస్ కావడంతో పాటు మరో సూట్‌కేస్ పూర్తిగా డ్యామేజ్ అయ్యింది. దీనికి సంబంధించి అమెరికా ఎయిర్‌లైన్ సంస్థ డెల్టా‌పై ట్విట్టర్ వేదికగా ఫైరయ్యారు.

Nimrat Kaur: విమాన ప్రయాణంలో నటి నిమ్రత్ కౌర్‌కు చేదు అనుభవం.. అమెరికా ఎయిర్‌లైన్స్‌పై ఫైర్
Nimrat kaur
Follow us on

Nimrat Kaur: సినీ నటి నిమ్రత్ కౌర్‌కు విమాన ప్రయాణంలో చేదు అనుభవం ఎదురయ్యింది. ఆమె లగేజీ మిస్ కావడంతో పాటు మరో సూట్‌కేస్ పూర్తిగా డ్యామేజ్ అయ్యింది. దీనికి సంబంధించి అమెరికా ఎయిర్‌లైన్ సంస్థ డెల్టా‌పై ట్విట్టర్ వేదికగా ఫైరయ్యారు. డ్యామేజ్ అయిన బ్యాగేజీ ఫోటోలను ట్వీట్ చేశారు. తన లగేజీని ఎయిర్‌లైన్ ఎక్కడో మిస్ చేసిందని, ఆ తర్వాత ఒక బ్యాగేజీ తనకు అందినా.. అది డ్యామేజ్ అయ్యిందని తెలిపారు. దీంతో తాను 90 గంటలకు పైగా తీవ్ర మానసిక, శారీరక ఒత్తిడికి గురైనట్లు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయంలో డెల్టా సంస్థ బాధ్యతారాహిత్యం స్పష్టంగా కనిపిస్తోందంటూ ధ్వజమెత్తారు. మిస్ అయిన లగేజీ ఎక్కడుందో గుర్తించి తనకు చేర్చాలని నిమ్రత్ కౌర్ కోరారు. దీనిపై స్పందించిన డెల్టా.. ఆమె ఫిర్యాదుపై సరైన చర్యలు తీసుకుంటామని, సంయమనంతో ఉండాలని కోరింది.

నిమ్రత్ కౌర్ కొన్ని హిందీ సినిమాలు, షార్ట్ ఫిల్మ్స్‌, మ్యూజిక్ వీడియోస్‌లలో నటించారు. అమెరికా టెలివిజన్‌లో ప్రసారమయ్యే హిందీ చిత్రాల్లోనూ ఆమె నటించారు. మోడల్, నటిగా ఆమె ఇటు భారత్, అటు అమెరికాలో గుర్తింపు పొందారు. రాజస్థాన్‌కు చెందిన నిమ్రత్ కౌర్ 2002లో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. చివరగా అభిషేక్ బచ్చన్ హీరోగా నటించిన దాస్వి సినిమాలో ఆమె నటించారు.

మరిన్ని సినిమా వార్తలు చదవండి