Actress Nidhi Agarwal: పవన్ సినిమా పై క్లారిటీ ఇచ్చిన ఇస్మార్ట్ భామ.. మై గోల్డెన్ ఫిల్మ్ అంటూ..

'సవ్యసాచి' సినిమాతో తెలుగు తెరకు పరిచయమయిన హీరోయిన్ నిధి అగర్వాల్. ఆ తర్వాత ఈ ముద్దు గుమ్మ చేసిన సినిమాలు అంతగా హిట్ కాలేకపోయాయి. గతేడాది పూరీ జగన్నాథ్, రామ్ పోతినేని

Actress Nidhi Agarwal: పవన్ సినిమా పై క్లారిటీ ఇచ్చిన ఇస్మార్ట్ భామ.. మై గోల్డెన్ ఫిల్మ్ అంటూ..

Updated on: Feb 06, 2021 | 7:01 PM

‘సవ్యసాచి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయిన హీరోయిన్ నిధి అగర్వాల్. ఆ మూవీ తర్వాత ఈ ముద్దు గుమ్మ చేసిన సినిమాలు అంతగా హిట్ కాలేకపోయాయి. గతేడాది పూరీ జగన్నాథ్, రామ్ పోతినేని కాంబోలో వచ్చి ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో నటించింది నిధి. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో నిధి టాలీవుడ్‏లో వరుస ఆఫర్లను అందుకుంటుంది. ప్రస్తుతం నిధి పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్‏గా నటించనున్నట్లుగా గతంలో వార్తలు వచ్చాయి. ఆ వార్తలు నిజమేనంటూ.. తాజాగా నిధి క్లారిటీ ఇచ్చింది.

ఇటీవల ఓ నెషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిధి మాట్లాడుతూ.. “అవును నేను పవన్ కళ్యాణ్‏తో ఓ సినిమా చేస్తున్నాను. ఆ ప్రాజెక్టులో భాగమవడం నాకు కలలా అనిపిస్తోంది. ఇది నాకు తొమ్మిదవ సినిమా. నా కెరీర్‏లోనే బంగారు సినిమా అవుతుంది. పవన్ సర్‏తో కలిసి పనిచేయడం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న” అంటూ చెప్పుకొచ్చింది. పవన్, క్రిష్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా గురించి ఇప్పటికే చాలా గాసిప్స్ వినిపించాయి. భారీ బడ్జెట్ పీరియడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అలాగే ఈ మూవీకి హరిహర వీరమల్లు అనే టైటిల్ అనుకుంటున్నట్లుగా టాక్. ఈ సినిమాను ఎ.ఎం రత్నం నిర్మిస్తున్నారు.

Also Read: దక్షిణాది సినిమాల రిమేక్‌ల కోసం ఎగబడుతున్న బాలీవుడ్ నిర్మాతలు.. తాజాగా ఎన్టీఆర్ హీరోగా నటించిన ఊసరవెళ్లి కూడా..