Tollywood Heroes: టాలీవుడ్‌ యంగ్ హీరోల నయా ట్రెండ్.. ఆడియన్స్ టేస్ట్‌కు తగ్గట్టు మారుతున్న కథ..

| Edited By: Janardhan Veluru

Jul 29, 2021 | 3:29 PM

New Trend in Tollywood: స్టార్ హీరోలు కూడా ట్రెండ్ మార్చారు. హీరో అంటే రాముడు మంచి బాలుడన్న ఫార్ములాను పక్కన్న పెట్టి ...

Tollywood Heroes: టాలీవుడ్‌ యంగ్ హీరోల నయా ట్రెండ్.. ఆడియన్స్ టేస్ట్‌కు తగ్గట్టు మారుతున్న కథ..
Telugu Heroes
Follow us on

ఒకప్పుడు సినిమా అంటే ఒక స్మార్ట్ హీరో… ఒక గ్లామరస్‌ హీరోయిన్‌.. ఒక వయలెంట్ విలన్‌… ఆరు పాటలు.. నాలుగు ఫైట్లు… మరో నాలుగు కామెడీ స్కిట్లు అంతే. కానీ ఇప్పుడు ట్రెండ్ వేరు. హీరో, హీరోయిన్‌, విలన్‌ అన్న కాన్సెప్ట్‌ను పక్క పెట్టేశారు స్టార్స్‌. సాలిడ్‌ కథ.. అందులో పర్ఫెక్ట్‌ క్యారెక్టర్స్‌… ప్రేక్షకుడిని కదలకుండా కూర్చోబెట్టే పర్ఫెక్ట్ స్క్రీన్‌ప్లే… ఇవే, ఈ జనరేషన్‌ సినిమాకు మెయిన్ ఇంగ్రీడియంట్స్‌.

స్టార్ హీరోలు కూడా ట్రెండ్ మార్చారు. హీరో అంటే రాముడు మంచి బాలుడన్న ఫార్ములాను పక్కన్న పెట్టి … అనుకున్నది సాధించే స్టబార్న్‌ క్యారెక్టర్స్‌కు సై అంటున్నారు. రీసెంట్ బ్లాక్ బస్టర్ కేజీఎఫ్‌… ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న పుష్ప సినిమాల్లో ఇలాంటి రోల్సే ప్లే చేస్తున్నారు హీరోలు. ఈ సినిమాల్లో దాదాపు విలన్‌ అనిపించే పాత్రల్లో కనిపించారు.. కనిపిస్తున్నారు మన హీరోలు.

చిన్న సినిమాలు కూడా మారాయి. హీరోయిన్‌ వెంటపడే రొమాంటిక్ హీరో పాత్రల చేయడానికి ఇష్టపడటం లేదు మన హీరోలు. ఛాన్స్ దొరికితే తమలోని వర్సటాలిటీ చూపించేందుకు ఇంట్రస్ట్‌ చూపిస్తున్నారు. నేచురల్‌ స్టార్‌ అనిపించుకున్న నాని కూడా వి సినిమాలో విలనిజం చూపించే ప్రయత్నం చేశారు. కొత్త హీరోలు కూడా ఫార్ములా సినిమాలను పక్కన పెట్టి కంటెంట్ ఉన్న కథల వైపు నడుస్తున్నారు. కథ డిమాండ్ చేస్తూ లుక్‌, ఫిజిక్‌ మొత్తం చేంజ్‌ చేయడానికి కూడా రెడీ అంటున్నారు.

Tollywood News

హీరోల టేస్ట్‌కు తగ్గట్టుగా మేకర్స్‌ కూడా మారుతున్నారు. లవ్‌ స్టోరీస్‌.. ఫ్యామిలీ డ్రామాలు బోర్‌ కొట్టేయటంతో థ్రిల్లర్ సినిమాలు, డిఫరెంట్ స్క్రీన్‌ప్లే ప్రయోగాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఓటీటీ హవా మొదలైన తరువాత కొత్త కథలు ఆడియన్స్‌ను అలరిస్తున్నాయి. రీసెంట్‌ టైమ్స్‌లో కొత్త తరహా స్క్రీన్‌ప్లేతో వచ్చిన ప్లే బ్యాక్‌, కుడి ఎడమైతే లాంటి సినిమాలు డిజిటల్‌ ఆడియన్స్‌ను మెప్పించాయి.

ప్రజెంట్ ఆడియన్స్‌ను అలరిస్తున్న మరో ఇంట్రస్టింగ్ జానర్‌ పీరియాడిక్‌. స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు ప్రతీ ఒక్కరు పీరియాడిక్ కథల వైపే చూస్తున్నారు. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్ హీరోగా జక్కన్న చెక్కుతున్న ట్రిపులార్‌, ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న రాధేశ్యామ్, సలార్… పవన్‌ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న హరి హర వీరమల్లు, నాని శ్యామ్‌ సింగరాయ్‌ లాంటి సినిమాలన్నీ పీరియాడిక్ జానర్‌లో తెరకెక్కుతున్నవే. ఇలా మన మేకర్స్‌, ఆర్టిస్ట్‌ అంతా సినిమా కథను.. మార్చేస్తున్నారు. ఇలాంటి ప్రయోగాలకే కాదు.. వెండితెర మార్పుకు సాధర స్వాగతం పలుకుతున్నారు మన ఆడియన్స్‌.

(సతీష్ రెడ్డి జడ్డా, TV9 Telugu, ET Desk)

Also Read..

RRR Movie: తగ్గేదే లే అంటున్న ట్రిపులార్ టీమ్.. ఇంతకీ జక్కన్న ధైర్యం ఏంటి..?

ధనుష్‌ మరో తెలుగు సినిమాకు సైన్‌ చేశాడా.. ఆ ట్వీట్‌కి అర్థం అదేనా.. డైరెక్టర్‌ ఇతనేనా.?