రాధారవి వ్యాఖ్యలపై స్పందించిన నయనతార

|

Mar 26, 2019 | 11:50 AM

  గత రెండు రోజులుగా కోలీవుడ్ ను కుదిపేస్తున్న రాధారవి వివాదంపై లేడి సూపర్ స్టార్ నయనతార ఓపెన్ అయ్యింది. రెండు రోజుల క్రితం ఒక ఫంక్షన్ కు హాజరై రాధారవి అసభ్యకర రీతిలో కామెంట్స్ చేశాడు. ఇక ఆయన మీద ఇప్పటికే చాలామంది ఫైర్ అయ్యారు. డీఎంకే పార్టీ అయితే ఆయన్ని ఏకంగా సస్పెండ్ కూడా చేసింది. ఇక ఈ విషయంపై నయన కు కాబోయే భర్త విగ్నేష్ శివన్ స్పందించినప్పటికీ… నయనతార మాత్రం సైలెంట్ […]

రాధారవి వ్యాఖ్యలపై స్పందించిన నయనతార
Follow us on

 

గత రెండు రోజులుగా కోలీవుడ్ ను కుదిపేస్తున్న రాధారవి వివాదంపై లేడి సూపర్ స్టార్ నయనతార ఓపెన్ అయ్యింది. రెండు రోజుల క్రితం ఒక ఫంక్షన్ కు హాజరై రాధారవి అసభ్యకర రీతిలో కామెంట్స్ చేశాడు. ఇక ఆయన మీద ఇప్పటికే చాలామంది ఫైర్ అయ్యారు. డీఎంకే పార్టీ అయితే ఆయన్ని ఏకంగా సస్పెండ్ కూడా చేసింది. ఇక ఈ విషయంపై నయన కు కాబోయే భర్త విగ్నేష్ శివన్ స్పందించినప్పటికీ… నయనతార మాత్రం సైలెంట్ గా ఉంది. అయితే తాజాగా ఆమె ఈ విషయంపై స్పందిస్తూ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.

“నేను సాధారణంగా పబ్లిక్ స్టేట్మెంట్స్ ఇవ్వను. వాటి మీద నేను కాకుండా నా వృత్తి మాట్లాడాలని నేను అనుకుంటా.  కాని కొన్ని అనివార్య పరిస్థితులు ఇలాంటివాటికి దారి తీస్తాయి. పురుషాధిపత్యం రాజ్యమేలుతున్న దుర్భర స్థితిలో నేను వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది. ముందుగా ఇది తెలిసిన వెంటనే రాధారవి మీద చర్యలు తీసుకున్న డిఏంకే ప్రెసిడెంట్ స్టాలిన్ కు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా.

రాధారవి లాంటి వాళ్ళు.. తమను జన్మనిచ్చింది కూడా ఒక ఆడది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి మగాళ్ళ మధ్య భయంతో మనుగడ సాగిస్తున్న మహిళల పట్ల నాకు సానుభూతి కలుగుతోంది. రాధారవి లాంటి వాళ్ళు భావితరాలకు మార్గదర్శకులుగా నిలవాల్సింది పోయి ఇలా దిగజారడం విషాదం. ఇలాంటి చీప్ పాపులారిటీ కోసం పాకులాడే రాధారవి లాంటి వాళ్ళతో సమాజానికి చాలా ప్రమాదం పొంచి ఉంది.

దేవుడు నాకు తమిళ ప్రేక్షకుల రూపంలో గొప్ప జీవితాన్ని అందుకునేలా చేసాడు. మంచి అవకాశాలు వచ్చేలా దీవించాడు. ఇలాంటి నెగటివ్ కామెంట్స్ ఎన్ని వచ్చినా నేను సీతగా, దెయ్యంగా, దేవతగా, స్నేహితురాలిగా, భార్యగా, ప్రేయసిగా నటిస్తూనే ఉంటాను. నా అభిమానుల వినోదానికి లోటు లేకుండా చూసుకుంటాను.

ఇక చివరిగా నడిగర్ సంఘానికి నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా.. ఇప్పటికైనా ఇలాంటి సంఘటనలకు విచారణ చేపట్టే విధంగా అంతర్గత ఫిర్యాదు విచారణ కమిటీని ఏర్పాటు చేస్తారా లేదా అని..?

మరోవైపు ఇలాంటి సమయంలో నాకోసం మద్దతు తెలుపుతూ..  నా అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.  అని నయనతార తన లేఖలో వివరించింది.