Nayanathara: మెగాస్టార్ అభిమానులకు ఇక పండగే.. ఆ పాత్రకు లేడీ సూపర్ స్టార్ నయనతార ఓకే చెప్పిందట..

|

Jan 19, 2021 | 9:08 AM

Nayanathara: తెలుగు, తమిళ భాషల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ నయనతార. తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.

Nayanathara: మెగాస్టార్ అభిమానులకు ఇక పండగే.. ఆ పాత్రకు లేడీ సూపర్ స్టార్ నయనతార ఓకే చెప్పిందట..
Follow us on

Nayanathara: తెలుగు, తమిళ భాషల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ నయనతార. తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అటు కమర్షియల్ సినిమాలలో నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియేంటెడ్ సినిమాలు చేస్తోంది. వ్యక్తిగతంగా పలు వివాదాలలో చిక్కుకున్న ఈ అమ్మడు సినిమాల పరంగా తనదైన శైలిలో దూసుకుపోతుంది.

తాజాగా టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న లూసీఫర్ రిమేక్‌లో మెగాస్టార్ చెల్లెలి పాత్రకు చిత్ర బృందం నయనతారను అనుకున్నారు అయితే దీనికి ఆమె దగ్గరి నుంచి ఎటువంటి స్పందన లేదు. తాజాగా ఆ క్యారెక్టర్‌కు నయన ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి నయన్ అలా క్యారెక్టర్ రోల్ చేయాల్సిన అవసరం లేదు. తాను నటిస్తానంటే ప్రధాన పాత్రధారిగా లేడీ ఓరియెంటెడ్ కథల్ని సిద్ధం చేసే దర్శకులు ఉన్నారు. కానీ నయన్ కేవలం రిలేషన్ షిప్ కోసం ఈ పాత్రకు అంగీకరించారని అంతా భావిస్తున్నారు. నయనతార ఇంతకుముందు మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహా రెడ్డి చిత్రంలో కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. అయితే మెగాస్టార్ రేంజుకు తగ్గట్టుగా ఆ పాత్రను తీర్చిదిద్దాకే నయన్ అంగీకరించి ఉంటారని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అల్లు అర్జున్‌ అంటే చాలా ఇష్టం.. టీమిండియా మహిళా క్రికెటర్‌ ప్రియా పునియా