డిఫరెంట్ లుక్‏లో కనిపించనున్న నాని.. ఆ సినిమా కోసం మేకోవర్ అవుతున్న నేచురల్ స్టార్..

|

Feb 01, 2021 | 8:37 PM

చురల్ స్టార్ నాని ప్రస్తుతం నటిస్తున్న సినిమా 'శ్యామ్ సింగరాయ్'. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా నానీ వరుస సినిమాలకు చేస్తూ బిజీగా మారాడు.

డిఫరెంట్ లుక్‏లో కనిపించనున్న నాని.. ఆ సినిమా కోసం మేకోవర్ అవుతున్న నేచురల్ స్టార్..
Follow us on

Shyam Singaray Movie Update: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘శ్యామ్ సింగరాయ్’. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా నానీ వరుస సినిమాలకు చేస్తూ బిజీగా మారాడు. ఇటీవలే టక్ జగదీష్ సినిమాను పూర్తిచేసిన నానీ.. ప్రస్తుతం శ్యామ్ సింగ రాయ్ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. గతేడాది డిసెంబర్లో మొదలైన ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో నానికి జోడీగా సాయి పల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీకి టాక్సీవాలా ఫేం రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ గురించి ఓ అప్ డేట్ ఫిల్మ్ వర్గాల నుంచి వినిపిస్తోంది.

ఈ సినిమాలో నాని డిఫరెంట్ లుక్‏లో కనిపించనున్నట్లుగా సమాచారం. ఇంతవరకు నాని నటించిన సినిమాల కంటే ఇందులో సరికొత్తగా నాని కనిపించబోతున్నట్లుగా టాక్. అందుకే ఇప్పటివరకు నాని పాత్రను రివీల్ చేయలేదని తెలుస్తోంది. కలకత్తా నేపథ్యంలో ఈ మూవీ ఉండబోతుంది. నిహారిక ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ ఎస్ బోయినపల్లి నిర్మిస్తున్నారు. దాదాపు ఈ సినిమా కోసం దర్శకుడు రాహుల్ రెండు సంవత్సరాలు వెయిట్ చేశాడట.

Also Read:

Republic Movie Update: సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ మూవీ థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడో చెప్పేసిన చిత్రయూనిట్..