గత రెండు మూడేళ్లుగా బాలకృష్ణ మోక్షజ్ఞ ఎంట్రీ గురించి టాలీవుడ్‌లో జోరుగా ఊహాగానాలు నడుస్తున్నాయి. మోక్షజ్ఞ ఎంట్రీ ఎపుడు అని అభిమానులు ఎప్పుడూ మాట్లాడుకుంటునే ఉన్నారు. ఆమధ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో మోక్షజ్ఞ పరిచయం అవుతారని కొన్ని రోజులు.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అని కొద్ది రోజులు ప్రచారం జరిగింది. అయితే, ఇటీవల బాలకృష్ణ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న మోక్షజ్ఞ ఫొటో బయటికి రావడంతో కొత్త వార్తలు పుట్టుకొచ్చాయి. అసలు మోక్షజ్ఞకు సినిమాలు అంటే ఆసక్తి లేదని, ఆయన బిజినెస్‌మేన్‌గా మారబోతున్నారని వదంతులు వచ్చాయి. తాజాగా మరో సారి మోక్షజ్ఞ ఎంట్రీ పై ఇంట్రస్టింగ్ వార్తలు ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతున్నాయి. మోక్షజ్ఞ త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడట. డాషింగ్ డైరెక్టర్ పూరీజగన్నాథ్ మోక్షజ్ఞను ఇండస్ట్రీకి పరిచయం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఓ కథను బాలయ్యకు కూడా వినిపించాడట. దానికి ఫిదా అయిపోయిన బాలయ్య వెంటనే దాన్ని ఓకే చేశాడని తెలుస్తోంది. 2021 చివర్లో ఈ మూవీ మొదలయ్యే అవకాశం ఉందని ఫిలింనగర్ టాక్.
మరిన్ని ఇక్కడ చదవండి :