Puneeth Rajkumar: పునీత్ పేరును పచ్చబొట్టుగా వేయించుకున్న నటి.. ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారంటూ..

కన్నడ పవర్‌ స్టార్‌, పునీత్‌ రాజ్‌కుమార్‌ (Puneeth Rajkumar) గతేడాది గుండెపోటుతో మరణించారు. అక్టోబర్‌ 29న వ్యాయామం చేస్తూ హఠాత్తుగా గుండెపోటు బారిన పడిన ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే తుదిశ్వాస విడిచారు.

Puneeth Rajkumar: పునీత్ పేరును పచ్చబొట్టుగా వేయించుకున్న నటి.. ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారంటూ..
Namratha Gowda

Updated on: Apr 27, 2022 | 9:36 PM

కన్నడ పవర్‌ స్టార్‌, పునీత్‌ రాజ్‌కుమార్‌ (Puneeth Rajkumar) గతేడాది గుండెపోటుతో మరణించారు. అక్టోబర్‌ 29న వ్యాయామం చేస్తూ హఠాత్తుగా గుండెపోటు బారిన పడిన ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే తుదిశ్వాస విడిచారు. సినిమా రంగంలో ఎంతో కెరీర్‌ ఉన్న పునీత్ అకస్మా్త్తుగా ఈ లోకం విడిచి వెళ్లడం అందరినీ ఆశ్చర్యపరిచింది. టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌, మాలీవుడ్‌ పరిశ్రమలకు చెందిన సినీ సెలబ్రెటీలు ఆయనకు నివాళులు అర్పించారు. ఇక కన్నడిగులైతే పునీత్‌ లేడనే వార్తను అసలు జీర్ణించుకోలేకపోయారు. కొందరి గుండెలు కూడా ఆగిపోయాయి. కాగా ఈ దురదృష్టకర సంఘటన జరిగి సుమారు ఆరు నెలలు గడిచింది. అయినా ఆయన ఇంకా చాలామంది హృదయాల్లో సజీవంగా నిలిచి ఉన్నారనడానికి తాజా సంఘటనే ఓ సాక్ష్యం. అదేంటంటే.. పునీత్‌ మీద ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ కన్నడ టీవీ నటి, నాగిని 2 ఫేం నమ్రతా గౌడ (Namrta Gowda) ఏకంగా ఆయన పేరును పచ్చబొట్టుగా వేయించుకుంది.

నమ్రత గౌడ పునీత్‌ రాజ్‌కుమార్‌కు వీరాభిమాని. అందుకే ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని తన అభిమాన నటుడి పేరును పచ్చబొట్టుగా వేయించుకుంది. తాజాగా ఆ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది. తన చేతిపై ఉన్న టాటూ ఫొటోను పంచుకుంటూ.. ‘ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు’ అని క్యాప్షన్‌ ఇచ్చింది. దీంతో ఈ పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా 2007లో పునీత్ నటించిన మిలానా సినిమాలో ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించింది నమ్రత. ఆతర్వాత నాగినీ 2 సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం పలు సీరియల్స్‌ తో పాటు కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Digital TOP 9 NEWS: ఆకట్టుకుంటున్న చాక్లెట్‌ పాము.. | టైల్స్‌ కింద రూ. 10కోట్ల క్యాష్‌.!

DC Vs KKR IPL 2022 Match Prediction: ఢిల్లీని ఢీకొట్టేందుకు సిద్ధమైన కోల్‌కతా.. గత రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Optical Illusion: ఈ ఆప్టికల్ ఇల్యూషన్ పిక్ వెరీ స్పెషల్.. మీరు రొమాంటిక్ ఆ? సింగిల్ ఆ? చెప్పేస్తుంది..!