The Ghost Trailer: హాలీవుడ్‌ సినిమాను తలపిస్తోన్న ‘ది ఘోస్ట్‌’ ట్రైలర్‌.. నాగ్‌ ఖాతాలో మరో హిట్‌ పడ్డట్లే..

The Ghost Trailer: మారుతోన్న కాలానికి అనుగుణంగా కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నారు కింగ్‌ నాగార్జున. ఓవైపు ఫ్యామిలీ ఓరియెంటెడ్‌ సినిమాల్లో నటిస్తూనే మరోవైపు యాక్షన్‌ చిత్రాల్లో మెప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే మరో యాక్షన్‌ మూవీతో...

The Ghost Trailer: హాలీవుడ్‌ సినిమాను తలపిస్తోన్న ది ఘోస్ట్‌ ట్రైలర్‌.. నాగ్‌ ఖాతాలో మరో హిట్‌ పడ్డట్లే..
The Ghost Trailer

Updated on: Aug 25, 2022 | 5:41 PM

The Ghost Trailer: మారుతోన్న కాలానికి అనుగుణంగా కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నారు కింగ్‌ నాగార్జున. ఓవైపు ఫ్యామిలీ ఓరియెంటెడ్‌ సినిమాల్లో నటిస్తూనే మరోవైపు యాక్షన్‌ చిత్రాల్లో మెప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే మరో యాక్షన్‌ మూవీతో ప్రేక్షకులకు ముందుకు వస్తున్నారు నాగార్జున. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రవీణ్‌ దర్శకత్వంలో వచ్చిన గరుడ వేగ ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు అదే కథాంశంతో వస్తోన్న ‘ది ఘోస్ట్‌’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 5వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్‌ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది. 1 నిమిషం 53 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌ను సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు చేతుల మీదుగా విడుదల చేశారు. ఇందులో నాగ్‌ ఒక రా ఏజెంట్‌ పాత్రలో నటిస్తున్నారు. కష్టాల్లో ఉన్న అక్కను కాపాడడానికి విక్రమ్‌ (నాగార్జున) ఎలాంటి సాహసాలు చేయాల్సి వచ్చింది. అసలు వారిని కిడ్నాపర్లు, గ్యాంగ్‌స్టర్‌లు ఎందుకు చంపాలనుకున్నారు. అన్న కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది.

ఇవి కూడా చదవండి

ఇందులో నాగ్‌ విక్రమ్‌ అనే పవర్‌ ఫుల్‌ రోల్‌లో నటిస్తున్నారు. ఇక నాగార్జున రొమాన్స్‌తోనూ ఆకట్టుకున్నారు. మొత్తం మీద ఘోస్ట్‌ ట్రైలర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నాగ్‌కు జోడిగా సోనాల్ చౌహాన్ నటిస్తోన్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..