టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర, చాందిని చౌదరి, అజయ్ రాకేందు మౌళి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘సూపర్ ఓవర్’. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఆహా’లో జనవరి 22న విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను అక్కినేని నాగచైతన్య సోషల్ మీడియాలో విడుదల చేసి.. చిత్రయూనిట్‌ను అభినందించారు. ఇటీవలే ఈ మూవీ స్నీక్ పీక్‌ను హీరో శర్వానంద్ రిలీజ్ చేశాడు. ఇక దానికి మంచి స్పందన వచ్చింది.
ఇక ట్రైలర్ చూస్తుంటే ఈ మూవీ మొత్తం సస్పెన్స్ థ్రిలర్ల్‌గా రానున్నట్లు తెలుస్తోంది. బెట్టింగ్‌లకు అలవాటు పడి పోలీస్ స్టేషన్‌కు దగ్గరలో దొంగతనం చేసిన ముగ్గురు వ్యక్తులు.. వాళ్ళను పట్టుకునేందుకు ప్రయత్నించే మరో ఇద్దరు వ్యక్తుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకు సన్నీ ఎమ్.ఆర్ సంగీతాన్ని అందించారు. అటు డెబ్యూ డైరెక్టర్ ప్రవీణ్ ఈ మూవీని తెరకెక్కించగా… దివాకర్ మని సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహించారు.
Also Read:
Puri Jagannadh : మరోసారి రిపీట్ కానున్న’సూపర్’ కాంబినేషన్.. నాగార్జునతో పూరీ సినిమా .?