SS Thaman: సినిమా పరిశ్రమపై కరోనా పంజా.. మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌కు పాజిటివ్‌..

దేశంలో కరోనా ప్రకంపనలు రేపుతోంది. సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు వరుసగా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ముఖ్యంగా సినిమా

SS Thaman: సినిమా పరిశ్రమపై కరోనా పంజా.. మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌కు పాజిటివ్‌..
Ss Thaman

Edited By: Janardhan Veluru

Updated on: Jan 07, 2022 | 3:18 PM

దేశంలో కరోనా ప్రకంపనలు రేపుతోంది. సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు వరుసగా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ముఖ్యంగా సినిమా పరిశ్రమలోని సెలబ్రిటీలు ఒక్కొక్కరూ ఈ వైరస్‌ కోరలకు చిక్కుతున్నారు. తాజాగా స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌.థమన్‌ కరోనా బాధితుల జాబితాలో చేరిపోయాడు.  ‘ నాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. నేను ప్రస్తుతం హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంటున్నాను. వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నాను. దయచేసి నన్ను కలిసిన వారందరూ తప్పకుండా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోండి’ అంటూ చెప్పాడీ మ్యూజిక్ డైరెక్టర్.

థమన్‌ త్వరగా కోలుకోవాలంటూ..
కాగా నిన్న (జనవరి6) సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు కరోనా బారిన పడ్డారు. ఈ విషయం తెలిసిన వెంటనే ప్రిన్స్‌ త్వరగా కోలుకోవాలని సోషల్‌ మీడియాలో మెసేజ్‌ పెట్టాడు థమన్‌. ఇప్పుడు అతనే కరోనా కోరలకు చిక్కడం గమనార్హం. ఈక్రమంలో థమన్‌ త్వరగా కోలుకోవాలని డైరెక్టర్‌ బాబీతో సహా పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. ఇక మంచు మనోజ్‌, మంచు లక్ష్మి, విశ్వక్‌ సేన్‌ తదితరులు ఇప్పటికే కరోనా బారిన పడ్డారు.

ఎస్ఎస్ థమన్ ట్వీట్..

Also Read:

Aadhaar : పెళ్లి తర్వాత ఆధార్ కార్డులో మీ ఇంటిపేరును ఎలా మార్చుకోవాలి.. పూర్తి ప్రక్రియను ఇక్కడ చూడండి..

Viral Video: శునకానందం అంటే ఇదే.. అప్పడం దొంగిలించిన కుక్క ఓ రేంజ్‌లో డ్యాన్స్ చేసింది.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..!

Raghurama Krishna Raju: ఎంపీ పదవికి రాజీనామా చేసి ఎన్నికలకి వెళ్తా.. మళ్ళీ గెలుస్తా..! RRR ఛాలెంజ్..(వీడియో)