War 2 Review: ఇద్దరు మిత్రులు చేసే యుద్ధం.. ఎవరు ఎటు వైపు.? వార్ 2 ఎలా ఉందంటే

War 2 Review: ఇద్దరు మిత్రులు చేసే యుద్ధం.. ఎవరు ఎటు వైపు.? వార్ 2 ఎలా ఉందంటే
War 2
War 2
UA
  • Time - 170 Minutes
  • Released - August 14, 2025
  • Language - Telugu, Hindi, Tamil
  • Genre - Action/Thriller
Cast - Hrithik Roshan, N.T. Rama Rao Jr, Kiara Advani, Ashutosh Rana
Director - Ayan Mukerji

Edited By:

Updated on: Aug 14, 2025 | 11:46 AM

నటీనటులు: హృతిక్‌ రోషన్‌, తారక్‌, కియారా అద్వానీ, అశుతోష్‌ రాణా, దిషిత సైగల్‌, అనిల్‌ కపూర్‌, సోనీ రాజ్దాన్‌ తదితరులు

నిర్మాణం: యష్‌ రాజ్‌ ఫిల్మ్స్

దర్శకత్వం: అయాన్‌ ముఖర్జీ

స్క్రీన్‌ప్లే: శ్రీధర్‌ రాఘవన్‌

మాటలు: రాకేందుమౌళి

నిర్మాణం: ఆదిత్య చోప్రా

కథ –

మేజర్‌ కబీర్‌ (హృతిక్‌ రోషన్‌) రా ఏజెంట్‌. ఎంతటి సాహసానికైనా సిద్ధమనే ఏజెంట్‌. అందులో భాగంగానే అతను మిషన్‌ కలిలో పార్టిసిపేట్‌ చేస్తాడు. కలి ఎవరు? ఆ గ్యాంగ్‌ ఏంటి అని తెలుసుకునే క్రమంలో వారికి చేరువవుతాడు. ఆ క్రమంలోనే తన ఆఖరి టార్గెట్‌గా కల్నల్‌ సునీల్‌ లూత్రా (అశుతోష్‌ రాణా)ని హతమారుస్తాడు. చిన్నప్పటి నుంచి తనకు అన్నీ అయిన వ్యక్తి సునీల్‌ లూత్రా. అయినా ఇండియా ఫస్ట్ అనే మాట కోసం తనను, తన ఎమోషన్స్ ని పక్కనపెట్టి లూత్రాని చంపుతాడు. క్రిమినల్‌గా రా కి కనిపిస్తాడు. అతన్ని పట్టుకునే మిషన్‌లోకి ఎంట్రీ ఇస్తాడు మేజర్‌ విక్రమ్‌ (ఎన్టీఆర్‌). అతనికి హెడ్‌గా లూత్రా ప్లేస్‌కి వస్తాడు రా ఛీఫ్‌ విక్రాంత్‌ కాల్‌ (అనిల్‌ కపూర్‌). వారి మిషన్‌లోకి ఎంట్రీ ఇస్తుంది కావ్య లూత్రా (కియారా అద్వానీ). మిషన్‌ స్టార్ట్ అయింది… విక్రమ్‌ చేతికి కబీర్‌ దొరికేశాడన్న టైమ్‌లోనే ట్విస్ట్ మొదలవుతుంది. కబీర్‌ పెంపుడు కూతురు రూహి (దిషిత) ప్రాణాలను కాపాడుతాడు విక్రమ్‌.

అక్కడి నుంచి విక్రమ్‌ని నమ్మసాగుతాడు కబీర్‌. తనకు ఓ మిషన్‌లో కావాల్సిన సాయాన్ని కోరుతాడు. డీల్‌కి ఓకే అని చెప్పిన విక్రమ్‌.. తీరా ట్విస్ట్ ఇస్తాడు. కబీర్‌ని కబూ అని పిలుస్తాడు. కబూ అని అప్పటిదాకా కబీర్‌ లైఫ్‌లో పిలిచింది ఒక్కరే. రఘు. అతనికి విక్రమ్‌కి ఏంటి లింకు? కబూ అనే పేరు విక్రమ్‌కి ఎలా తెలుసు? కబీర్‌కి సాయం చేస్తానని చెప్పిన విక్రమ్‌ చివరి నిమిషంలో హ్యాండ్‌ ఎందుకిచ్చాడు? కబీర్‌కి కావ్య ఏమవుతుంది? లూత్రా ప్లేస్‌ని రీప్లేస్‌ చేసిన రా ఛీఫ్‌ విక్రాంత్‌ మంచి వాడేనా? అతని మీద మొదటి నుంచీ విలాస్‌ సారంగ్‌కి ఎందుకంత అపనమ్మకం.. అసలు విలాస్‌ సారంగ్‌ మోటివ్‌ ఏంటి? అతని కుటుంబసభ్యులను చంపింది ఎవరు? అంత అవసరం ఏం వచ్చింది?.. ఇలాంటి చాలా విషయాలు తెలుసుకోవాలంటే సిల్వర్‌స్క్రీన్స్ మీద వార్‌2ని చూడాల్సిందే.

హృతిక్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. స్పై స్టోరీస్‌ కోసమే పుట్టారా? అన్నట్టుంది స్క్రీన్‌ ప్రెజెన్స్. ఏజ్‌ పెరుగుతున్న కొద్దీ గ్రేస్‌ కూడా పెరుగుతోంది హృతిక్‌లో. యాక్షన్‌ సీక్వెన్స్ లో ది బెస్ట్ అనిపించారు. కబీర్‌ కేరక్టర్‌ని సునాయాసంగా చేశారు. కబీర్‌ అనే వ్యక్తి నిజంగా రాలో ఉంటే.. ఇలాగే ఉంటారేమో అనిపించేలా ఉంది హృతిక్‌ నటన.
స్పై యూనివర్శ్‌లో నయా ఎంట్రీ ఎన్టీఆర్‌. ఆల్రెడీ హృతిక్‌కి కొట్టిన పిండి ఈ కాన్సెప్ట్. ఇందులో కొత్తగా కనిపించి మెప్పించి ఒప్పించాల్సిన బాధ్యతంతా తారక్‌దే. అంత బాధ్యత ఉన్నా ఏమాత్రం కంగారుపడకుండా ఈజ్‌తో చేశారు తారక్‌. హృతిక్‌కి పోటాపోటీగా ప్రతి సీన్‌లోనూ కనిపించారు. హృతిక్‌ యాక్షన్‌తో మెప్పిస్తే.. అందుకు ధీటుగా సన్నివేశాలను రక్తి కట్టించారు. ఎమోషన్స్ లోనూ ది బెస్ట్ పెర్ఫార్మర్‌ అనే విషయాన్ని మరోసారి ప్రూవ్‌ చేసుకున్నారు తారక్‌.
హృతిక్‌ అండ్‌ తారక్‌ని స్క్రీన్స్ మీద చూసిన ఫ్యాన్స్ కి కన్నులపండుగే. ఒకరినొకరు టీజ్‌ చేసుకునే సందర్భాలు కావచ్చు, సలామే పాటకు డ్యాన్స్ కావచ్చు, గాల్లో, నీటిలో, మంచులో ఫైట్స్ కావచ్చు.. ఏదైనా ఇద్దరికి ఇద్దరూ పోటాపోటీగా హోరాహోరీగా కనిపించిన సినిమా వార్2.

కియారా అద్వానీ జస్ట్ గ్లామర్‌ షో చేయడంతోనే సెటిల్‌ కాలేదు. అంతకు మించి చేశారు ఈ సినిమాలో. హృతిక్‌తో ఆమె చేసే యాక్షన్‌ సినిమాలో మెప్పిస్తుంది. బ్యూటీ విత్‌ బ్రెయిన్‌గా ఆమె కేరక్టర్‌ మెప్పిస్తుంది. తన లవ్‌ని కబీర్‌ యాక్సెప్ట్ చేయనప్పుడు ఎంత హర్ట్ అవుతుందో, మిషన్‌లో ఫ్లైట్‌కి పైలట్‌ కావాల్సినప్పుడు టాలెంట్‌తో అంతే ప్రూవ్‌ చేసుకుంటుంది. కావ్య కేరక్టర్‌ని బాగా డీల్‌ చేశారు అయాన్‌. ఇద్దరు హీరోలను స్క్రీన్‌ మీద డీల్‌ చేయడం అంత ఈజీ విషయం కాదు. అందులోనూ ఇంత భారీ స్కేల్‌తో, ఇంత హ్యూజ్‌ స్పాన్‌ ఉన్న సినిమాను డీల్‌ చేయడం తేలిక కాదు. తన వంతు కృషి చేశారు అయాన్‌ ముఖర్జీ. ప్రతి ఫ్రేమ్‌నీ జాగ్రత్తగా డీల్‌ చేశారనే విషయం అర్థమవుతుంది. కథలో భాగంగా వచ్చే రూహీ రోల్‌.. కెప్టెన్‌ ఖలీద్‌ రెఫరెన్సుల కోసం, సూపర్‌ డూపర్‌ ఛేజ్‌ కోసం, హీరోలకు ఒకరికి ఒకరు పరిచయం కావడం కోసం ఉపయోగపడుతుంది.

ఇద్దరి బాల్యమిత్రుల కథను రాతో ముడిపెట్టి సాగించే ప్రయత్నం చేశారు కెప్టెన్‌. కొన్నిచోట్ల వావ్‌ అనిపించే కథనం.. మరికొన్ని చోట్ల మరీ నెమ్మదిగా సాగినట్టు కనిపిస్తుంది. ఫొటోగ్రఫీ, లొకేషన్స్ ఆకట్టుకుంటాయి. ఇద్దరు హీరోల కథకు సంభాషణలు ప్రాణం పోస్తాయి. ఈ కథలో డైలాగులు బాగా రాశారు రాకేందుమౌళి. స్పై కథలు అనగానే ఏదో మిషన్‌.. అందుకోసం సరిహద్దులు దాటి చేసే ప్రయాణం.. చూపించే తెగువ.. ఇలాంటివి కామన్‌గా కనిపిస్తాయి కాబట్టి సినిమా రొటీన్‌గా అనిపిస్తుంది. గ్రాఫిక్స్ మీద అక్కడక్కడా కంప్లయింట్స్ ఉన్నా… విజువల్స్ పరంగా స్పెక్టాక్యులర్‌ మూవీ అనేది మాత్రం ఎవరూ కాదనలేని విషయం. ఈ సినిమాతో హృతిక్‌ తెలుగు ఆడియన్స్ కి పరిచయమైతే, తారక్‌ మాత్రం హిందీ ఆడియన్స్ కి జబర్దస్త్ గా ఇంట్రడ్యూస్‌ అయ్యారు. స్పై యూనివర్శ్‌ నెక్స్ట్ చాప్టర్లలోనూ తారక్‌ కనిపించే ఛాన్సులు ఎక్కువనే విషయం అర్థమవుతుంది. సినిమా ఆఖర్లో ఆల్పా సినిమా స్టోరీని టచ్‌ చేయడం కూడా సర్‌ప్రైజింగ్‌గా అనిపిస్తుంది. ఇద్దరు హీరోల కథను, వారిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని, వైరాన్ని, అంతకు మించిన స్నేహాన్ని చూడాలంటే థియేటర్లకు వెళ్లాల్సిందే. ఫ్యాన్స్ కే కాదు..స్పై యూనివర్శ్‌ని ఇష్టపడేవారికి కూడా నచ్చే సినిమా వార్‌2.

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి