Aranya Review:
సినిమా : అరణ్య
నటీనటులు: రానా, విష్ణు విశాల్, పులకిత్ సామ్రాట్, జోయా హుస్సేన్, రఘుబాబు
దర్శకత్వం: ప్రభు సాల్మన్
సంగీతం: శంతన్ మొయిత్రా
విభిన్న కథలను ఎంచుకునే దగ్గుబాటి యంగ్ హీరో రానా ఇప్పడు అరణ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బాహుబలి సినిమాతో విలన్ గా మెప్పించిన రానా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేచుకున్నాడు. ఇక అరణ్య విషయానికొస్తే ప్రభు సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏనుగుల సంరక్షకుడిగా నటించాడు రానా ఈ సినిమా మార్చి 26న (శుక్రవారం )ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం..
కథ :
సాగరతీరం విశాఖపట్టణానికి సమీపంలో చిలకల కోన అనే అడవి ఉంటుంది. అక్కడ ఒక కుటుంబం తరతరాలనుంచి ఏనుగులను కాపాడుతూ వస్తుంటుంది. ఆ అడవిలోనే పుట్టిపెరుగుతాడు నరేంద్ర భూపతి (రానా ). అడవి, ఏనుగుల రక్షణ కోసం పాటు పడుతున్నందుకు ఫారెస్ట్ మేన్‌గా రాష్ట్రపతి పురస్కారం కూడా అందుకుంటాడు నరేంద్ర భూపతి. ఇదిలాఉంటే కేంద్రమంత్రి కనకమేడల రాజగోపాలం (అనంత్ మహదేవన్) ఆ అడవిపై కన్నేస్తాడు. అక్కడ డీ.ఎల్.ఆర్ టౌన్‌షిప్ కట్టాలని ప్లాన్ చేసుకుంటాడు. ఈ క్రమంలో ఏనుగులు నీటి కోసం వెళ్లే అటవీ ప్రాంతంలో గోడ ఏర్పాటు చేస్తాడు. అడవినే నమ్ముకున్న ఏనుగుల కోసం నరేంద్ర భూపతి కేంద్రమంత్రిపై ఎలా పోరాటం చేసాడు. అడవిని ఎలా రక్షించుకున్నాడు అన్నది మిగిలిన కథ.
ఎవరెలా చేసారంటే..
ఏనుగుల సంరక్షకుడిగా రానా పాత్రలో ఒదిగిపోయాడు. అడవి మనిషిగాకనిపించేందుకు రానా పడిన కష్టం సినిమాలో కనిపిస్తుంది. రానా తప్ప మరొకరు చేయలేరనిపించేలా ఆయన ఆ పాత్రపై ప్రభావం చూపించారు. విష్ణు విశాల్ కూడా శింగన్న అనే పాత్రలో నటించాడు. విష్ణు విశాల్ తన పాత్రకు తగిన న్యాయం చేసాడు. కేంద్రమంత్రిగా నటించిన అనంత్ మహదేవన్ కూడా చక్కటి నటనతో ఆకట్టుకున్నారు. శ్రియ పిల్గవోంకర్ జర్నలిస్టుగా కీలకమైన పాత్ర చేసింది.
సాంకేతిక వర్గం :
కెమెరామెన్ అశోక్‌కుమార్ అడవి అందాల్ని అద్భుతంగా చూపించారు. శంతను మొయిత్రా సంగీతం, రసూల్ పోకుట్టి సౌండ్ డిజైనింగ్ ప్రేక్షకుడికి అడవిలో ఉన్న అనుభూతినికలిగేలా చేసాయి. చిటికేసే ఆ చిరుగాలి పాట చూపరులను ఆకట్టుకుంది. దర్శకుడు ప్రభు సాల్మన్ కథ కంటే కూడా తన మార్క్ క్యారెక్టరైజేషన్‌తో, ఓ మంచి సందేశంతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దిన తీరు మెప్పిస్తుంది.
చివరిగా : అరణ్యకు రానా ప్రాణం పోశాడు
మరిన్ని ఇక్కడ చదవండి :
Krithi Shetty: అందాల కృతికి అవకాశాల వెల్లువ.. తక్కువ టైమ్ లోనే టాప్ హీరోయిన్ గా ఎదిగే ఛాన్స్..
Dr Rajasekhar : విభిన్నమైన కథతో రానున్నయాంగ్రీ మ్యాన్ సినిమా.. ఆసక్తి రేపుతున్న టైటిల్..