‘అల్లాద్దీన్’ మూవీ రివ్యూ
ప్రపంచవ్యాప్తంగా ఫిక్షన్ కథలకు సినీ ప్రేక్షకుల్లో మంచి డిమాండ్ ఉంది. అందుకే వాటిని తెరకెక్కించేందుకు దర్శకులు సైతం ఆసక్తిని చూపుతారు. అలా వచ్చిన కథల్లో అరేబియన్ నైట్స్ కథల్లోని అల్లాద్దీన్- అద్భుత దీపం ఒకటి. 1992లో వచ్చిన ఈ యానిమేటెడ్ చిత్రం అందరినీ మెప్పించింది. ఇక మారిన సాంకేతిక నేపథ్యంలో ఇప్పుడు అదే చిత్రాన్ని మనుష్యులతో తెరకెక్కించింది డిస్నీ సంస్థ. గై రిట్చి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విల్ స్మిత్, మీనా మసూద్, సీమ్‌పెడ్రాడ్, నమి […]
ప్రపంచవ్యాప్తంగా ఫిక్షన్ కథలకు సినీ ప్రేక్షకుల్లో మంచి డిమాండ్ ఉంది. అందుకే వాటిని తెరకెక్కించేందుకు దర్శకులు సైతం ఆసక్తిని చూపుతారు. అలా వచ్చిన కథల్లో అరేబియన్ నైట్స్ కథల్లోని అల్లాద్దీన్- అద్భుత దీపం ఒకటి. 1992లో వచ్చిన ఈ యానిమేటెడ్ చిత్రం అందరినీ మెప్పించింది. ఇక మారిన సాంకేతిక నేపథ్యంలో ఇప్పుడు అదే చిత్రాన్ని మనుష్యులతో తెరకెక్కించింది డిస్నీ సంస్థ. గై రిట్చి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విల్ స్మిత్, మీనా మసూద్, సీమ్‌పెడ్రాడ్, నమి స్కోట్ తదితరులు నటించారు. ఇక తెలుగులోనూ ఈ చిత్రానికి వెంకటేశ్, వరుణ్ తేజ్ వాయిస్‌లు ఇవ్వడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. మరి ఈ నేపథ్యంలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
కథ: తల్లిదండ్రులను చిన్నప్పుడే పోగొట్టుకున్న అల్లాద్దీన్(మీనా మసూద్) ఏ పనిపాట లేకుండా బలాదూర్‌గా తిరిగేస్తుంటాడు. కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అల్లాద్దీన్‌కు యువరాణి జాస్మిన్(నయోమి స్కాట్)పరిచయం అవుతుంది. వారి మధ్య జరిగిన కొన్ని సంఘటనలతో ఇద్దరికీ ఒకరిపై ఒకరికి ప్రేమ కలుగుతుంది. అయితే జాస్మిన్ రాజ్యంలోని జాఫర్ అనే క్రూరుడు ఆ రాజ్యాన్ని కైవసం చేసుకోవడానికి జీని(మాయా లాంతర్) కోసం ప్రయత్నాలు చేస్తుంటాడు. అనుకోని పరిస్థితుల్లో ఆ లాంతర్ అల్లాద్దీన్‌కు దొరుకుతుంది. దాంతో అల్లాద్దీన్ ఏం చేశాడు..? యువరాణి జాస్మిన్‌ను ఎలా పొందాడు..? జాఫర్ నుంచి ఆ రాజ్యాన్ని ఎలా కాపాడాడు..? అన్నదే మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్: అద్భుతమైన విజువల్స్ ప్రధానపాత్రధారుల నటన ఎమోషనల్ సీన్లు గై రిట్చి దర్శకత్వం
మైనస్ పాయింట్స్: అర్థం కాని పాటలు అక్కడక్కడా స్లోగా సాగిన సన్నివేశాలు
విశ్లేషణ: సాంకేతికతను వాడుకొని అల్లాద్దీన్‌ను విజువల్ వండర్‌గా తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు అరేబియన్ రాజ్యంలోకి వెళ్లి విహరిస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. నటీనటుల విషయానికొస్తే.. ఈ సినిమాలో జీనీగా విల్ స్మిత్.. అల్లాద్దీన్‌గా మీనా మసూద్, ప్రిన్సెస్‌గా నయోమి స్కాట్ బాగా నటించారు. అలాగే విల్ స్మిత్, మీనా మసూద్ పాత్రలకు వెంకటేశ్, వరుణ్ చెప్పిన డబ్బింగ్ బాగా కుదిరింది. ఇక ఆ విభాగం, ఈ విభాగం అని పేరు లేకుండా.. ప్రతి విభాగంలోనూ అల్లాద్దీన్ అందరినీ ఆకట్టుకుంటాడు.
ఫైనల్ వర్డిక్ట్: అద్భుత విజువల్స్‌తో అబ్బురపరిచే అల్లాద్దీన్.