యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ సాలిడ్ హిట్ కోసం చాలకాలంగా ఎదురుచూస్తున్నాడు. అల్లుడు శీను సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్ర హీరో వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తూ వచ్చాడు. అయినా సరైన సక్సెస్ సాధించలేక పోయాడు. చివరగా రమేష్ వర్మ తెరకెక్కించిన ‘రాక్షసుడు’ సినిమాతో హిట్‌ను అందుకున్నాడు. తమిళ్ లో తెరకెక్కిన రచ్చసన్ సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరక్కెక్కించారు.
ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్’ అనే సినిమా చేస్తున్నాడు. నభనటేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించనుంది. కందీరీగ, హైపర్ సినిమాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సంతోష్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం అందిస్తున్నారు. ఇక బెల్లంకొండ వారబ్బాయికి తన సినిమాల్లో స్టార్ హీరోయిన్స్ తో మాస్ మసాలా ఐటమ్ పాటలకు చిందేయడం అలవాటే.. తాజాగా అల్లుడు అదుర్స్ సినిమాలో కూడా అదిరిపోయే ఐటమ్ సాంగ్ ఉండనుందట. ఈ పాటలో నటించే బ్యూటీ కోసం చాలకాలంగా వెతుకుతున్నారు చిత్రయూనిట్. చివరకు ఓ బాలీవుడ్ భామను ఎంపిక చేసారని తెలుస్తుంది. నాగిని సీరియల్లో నటించి ఆకట్టుకున్న అందాల భామ మోని రాయ్ బెల్లంకొండతో స్టెప్పులేయబోతుందని అంటున్నారు. కన్నడ బ్లాక్ బస్టర్ కేజీఎఫ్ సినిమాలో ఈ భామ ఐటమ్ సాంగ్ లో కనిపించి కవ్వించింది. ఇక సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో రెచ్చిపోతున్న ఈ చిన్నది అల్లుడు అదుర్స్ లో స్టెప్పులేస్తే నిజంగా ఐటమ్ సాంగ్స్ ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి.