Most Eligible Bachelor : మరింత ఆలస్యంగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. మే నెలలో ప్రేక్షకులముందుకు…

అక్కినేని యంగ్ హీరో అఖిల్ హీరోగా నిలబడటానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. మొదటి సినిమానే యాక్షన్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో నటించాడు...

Most Eligible Bachelor : మరింత ఆలస్యంగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. మే నెలలో ప్రేక్షకులముందుకు...

Updated on: Jan 15, 2021 | 4:44 PM

Most Eligible Bachelor : అక్కినేని యంగ్ హీరో అఖిల్ హీరోగా నిలబడటానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. మొదటి సినిమానే యాక్షన్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో నటించాడు. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆతర్వాత విక్రమ్ కుమార్ కే దర్శకత్వంలో ‘హలో’అనే లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ సినిమా కుడా దారుణంగా నిరాశపరిచింది. ఆతర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో’మిస్టర్ మజ్ను’సినిమా చేశాడు. భారీ ఆశలు పెట్టుకున్న ఈ సినిమా కుడా బాక్సాఫీస్ దగ్గర బోల్తకోట్టింది.

దాంతో కాస్త గ్యాప్ తీసుకున్న అఖిల్ ఇప్పుడు’మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాను బొమ్మరిల్లు బాస్కర్ తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉంది. నిజానికి ఈమూవీ ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావలసింది కానీ  కరోన కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని చిత్రయునిట్ భావించింది. అయితే సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర గట్టిపోటీ ఉండటంతో అఖిల్ సినిమా వెనక్కి తగ్గింది.

ఇంత పోటీలో విడుదల చేయడం మంచిదికాదు,పైగా ఓపినింగ్స్ పెద్దగా రాకపోవచ్చు అని మేకర్స్ భావించారు. దాంతో ఈసినిమా రిలీజ్ ను సమ్మర్ కు షిఫ్ట్ చేశారు. పోనీ జనవరినికాదని ఫిబ్రవరికి రిలీజ్ చేద్దామనుకుంటే..’ఉప్పెన’, సందీప్ కిషన్’ఏ1 ఎక్స్ ప్రెస్’ఉన్నాయి.ఇక మార్చిలోనితిన్ ‘రంగ్ దే, శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ’ సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. ఏప్రిల్ లో పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ నాని ‘టక్ జగదీష్’ తోపాటు భారీ సినిమా ‘కెజిఎఫ్ 2’ రిలీజ్ కు రెడీ గా ఉన్నాయి. దాంతో వీటన్నింటి తర్వాత నెమ్మదిగా మేలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Vakeel Saab Satellite Rights : భారీ ధరకు అమ్ముడైన వకీల్ సాబ్ శాటిలైట్ రైట్స్.. పవన్ స్టామినా ఇది అంటున్న ఫ్యాన్స్