Radhakrishna Movie: నిర్మల్ బొమ్మల నేపథ్యంలో తీసిన రాధాకృష్ణ సినిమాను అందరూ ఆదరించాలని తెలంగాణ పర్యావరణ, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. అనురాగ్, ముస్కాన్ సేథీ జంటగా నటించిన ఈ చిత్రం ‘ఢమరుకం’ శ్రీనివాసరెడ్డి దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందింది. టి.డి. ప్రసాద్ వర్మ దర్శకత్వంలో పుప్పాల సాగరికా కృష్ణకుమార్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుకలో మంత్రి మాట్లాడారు.
నిర్మల్ కళాకారుల కష్టాల నేపథ్యంలో మంచి ఆశయంతో తీసినందున ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీనుకెళ్తానని తెలిపారు. శ్రీనివాస్‌రెడ్డి పట్టుబట్టి ఈ సినిమాలో తనతో ఓ పాత్ర చేయించారన్నారు. కేవలం ప్రేమకథా చిత్రంగానే కాక అంతరించి పోతున్న హస్తకళలను బతికించాలని ఒక మంచి సందేశాన్ని ‘రాధాకృష్ణ’లో ఇస్తున్నామని దర్శకుడు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అనంతరం ప్రసాద్ వర్మ, సంగీత దర్శకురాలు శ్రీలేఖ, నటుడు అలీ, డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను తదితరులు సినిమా విశేషాలను వెల్లడించారు.
Sepoy Laxman Killed: జమ్మూ కశ్మీర్‌లో దారుణం.. పాకిస్తాన్ కాల్లుల్లో మరో భారత సైనికుడి వీర మరణం..