జీవితంలో విజయం సాధించడానికి అనుభవాలే మంచి పాఠాలుగా ఉపయోగపడుతాయి. ఈ స్టేట్‌మెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి మినహాయింపేం కాదు. ఇంకా చెప్పాలంటే మెగాస్టార్‌గా ఎదిగే క్రమంలో ఆయన పడ్డ కష్టాలు కూడా చాలానే ఉన్నాయి. వాటన్నింటిని ఎదుర్కొని వచ్చి స్వయం కృషితో మెగాస్టార్ బిరుదును సంపాదించుకున్న చిరు.. ఇప్పటికీ ఎంతోమందికి ఇన్ఫిరేషన్‌గా కొనసాగుతూనే ఉన్నారు. ఇదిలా ఉంటే సైరా తరువాత ఆయనలో చాలా మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బడ్జెట్ విషయంలో.. తన స్టేటస్‌ను పక్కన పెట్టి చిరు పొదుపు మంత్రాన్ని పాటిస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే సైరా సినిమా కోసం చెర్రీ బాగానే ఖర్చు పెట్టారు. అయితే విడుదల తరువాత ఈ మూవీకి మిగిలిన భాషల్లో నష్టాలు వచ్చాయి. వాటన్నింటిని దగ్గరుండి గమనించిన చిరు ఓ నిర్ణయం తీసుకున్నారట.
ఇప్పుడు షూటింగ్‌ల్లో కార్వాన్ కల్చర్ అన్నది కామన్‌గా మారింది. స్టార్ హీరో, హీరోయిన్లే కాదు.. కొంచెం పేరు మోసిన నటీనటులు కూడా కార్వాన్ కల్చర్‌కు అలవాటు పడ్డారు. ఈ క్రమంలో షూటింగ్ జరిగే సమయంలో రోజుకు దాదాపుగా 12 కార్వాన్‌లు అవసరమవుతున్నాయి. దీని వలన నిర్మాతలకు ఎక్కువ భారం కూడా పడుతోంది. కానీ ఇది ఇంతటితో ఆగిపోలేదు. షూటింగ్‌కు రెడీ అన్నప్పుడు ఆ కార్వాన్‌ల దగ్గరకు అసిస్టెంట్‌లు వెళ్లి.. నటీనటులను పిలవాల్సి వస్తోంది. దీంతో సమయం కూడా వృధా అవుతోంది. వీటన్నింటిని గమనించిన చిరు.. ఈ పద్దతిని మార్చాలని అనుకున్నారట.
ఆ మధ్య కాలంలో ఏదైనా సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు.. మధ్యలో బ్రేక్ సమయంలో అక్కడే అందరూ కుర్చీలలో కూర్చునేవారు. ఇప్పుడు కూడా అలా చేయడమే మంచిదని చిరు సూచించారట. అంతేకాదు ఇప్పుడు కొరటాల దర్శకత్వంలో చిరు ఆచార్య సినిమాలో నటిస్తుండగా.. ఈ మూవీ షూటింగ్‌లో చిరు అలానే ఉంటున్నారట. దీని వలన నిర్మాతకు భారాన్ని తగ్గించొచ్చని ఆయన అనుకుంటున్నారట. నిజానికి చెప్పాలంటే ఇది చాలా మంచి నిర్ణయం. ఈ విషయంలో మెగాస్టార్ ముందడుగు వేశారు. మరి మిగిలిన హీరోలు కూడా ఇలానే ఆలోచిస్తే.. నిర్మాతలకు అధిక భారాన్ని తగ్గే అవకాశం ఉంటుంది.