KRR works: కొత్త తరాన్ని పరిచయం చేసే దిశగా దర్శకేంద్రుడి కొత్త జర్నీ.. చిరు చేతుల మీదుగా లాంచ్‌.

తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వారిలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఒకరు. ఎన్నో అద్భుత చిత్రాలకు దర్శకత్వం వహించి, తెలుగు సినిమా స్థాయిని జాతీయ స్థాయిలో చాటారు. నాలుగు నంది అవార్డులు, 5 ఫిలిమ్‌ ఫేర్‌ అవార్డులతో ఇండస్ట్రీలో..

KRR works: కొత్త తరాన్ని పరిచయం చేసే దిశగా దర్శకేంద్రుడి కొత్త జర్నీ.. చిరు చేతుల మీదుగా లాంచ్‌.
Chiranjeevi

Edited By: Ravi Kiran

Updated on: Feb 16, 2023 | 6:19 PM

తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వారిలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఒకరు. ఎన్నో అద్భుత చిత్రాలకు దర్శకత్వం వహించి, తెలుగు సినిమా స్థాయిని జాతీయ స్థాయిలో చాటారు. నాలుగు నంది అవార్డులు, 5 ఫిలిమ్‌ ఫేర్‌ అవార్డులతో ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేశారు. అంతేకాకుండా ఇండస్ట్రీకి ఎంతో మంది ఔత్సాహిక నటీనటులను పరిచయం చేసిన ఘనత రాఘవేంద్రరావు సొంతం. దాదాపు 48 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎంతో మందిని వెండి తెరకు పరిచయం చేసిన దర్శకేంద్రుడి ఇప్పుడు కొత్త తరాన్ని పరిచయం చేస్తున్నారు.

ఇందులో భాగంగా కేఆర్‌ఆర్‌ వర్క్స్‌ పేరుతో యూట్యూబ్ ఛానల్‌ను లాంచ్‌ చేశారు. ఈ ఛానల్‌ ద్వారా కొత్త వారికి అవకాశాలు కల్పించనున్నారు. ఇప్పటికే పలు షార్ట్ మూవీస్‌ షూటింగ్‌ సైతం ప్రారంభమైంది. సినిమా పరిశ్రమలో ఉన్న అన్ని క్రాఫ్ట్స్‌లో కొత్త వారికి అవకాశాలు కల్పించేందుకు ఈ యూట్యూబ్‌ ఛానల్‌ను తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే ఈ యూట్యూబ్‌ ఛానల్‌ను మెగాస్టార్ చిరంజీవి లాంచ్‌ చేయడం విశేషం.

మెగాస్టార్‌కు, రాఘవేంద్రరావుకు మధ్య ఉన్న సాన్నిహిత్యం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగాస్టార్ చిరంజీవితో జగదేకవీరుడు అతిలోకసుందరి, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు లాంటి ఎన్నో బ్లాక్‌ బ్లస్టర్‌ హిట్స్‌ను అందించారు. ఈ నేపథ్యంలో తాజాగా భోళా శంకర్‌ సెట్‌ని కూడా రాఘవేంద్ర రావు సందర్శించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే కేఆర్‌ఆర్‌ వర్క్స్‌ యూట్యూబ్‌ ఛానల్‌ను లాంచ్‌ చేసిన మెగాస్టార్‌ రాఘవేంద్రరావుకు ఆల్‌ ది బెస్ట్‌ తెలిపారు. ఇండస్ట్రీలోకి కొత్త వారికి తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నా్ని చిరు ఆహ్వానించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..