
తెలుగు సినీ జగత్తులో తమకంటూ ప్రత్యేకాధ్యాయాన్ని లిఖించుకున్న హీరో మెగాస్టార్ చిరంజీవి. ఈరోజు ఆయన పుట్టినరోజును (ఆగస్టు 22) పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే మెగా ఫ్యాన్స్ రకరకాల సేవా కార్యక్రమాలు, వినూత్న వేడుకలతో సందడి చేస్తున్నారు. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా కుప్పం పట్టణానికి చెందిన ఒక సూక్ష్మ కళాకారుడు చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని ఎంతో సృజనాత్మకంగా వ్యక్తపరిచారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అతడి నైపుణ్యం చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Bigg Boss 10 Telugu : బిగ్‌బాస్‌లోకి ఈశ్వర సాయి, మాధురి రాథోడ్.. ఆది రెడ్డి చెప్పిందే నిజమవుతుందా.. ?
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజున వేడుకలను అభిమానులు పెద్ద ఎత్తున జరుపుకుంటున్నా. ఎవరికి తోచినట్టుగా వాళ్ళు అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇందులో భాగంగానే చిత్తూరు జిల్లాలో మెగాస్టార్ పుట్టినరోజును ఒక కళాకారుడు డిఫరెంట్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. తనకు తెలిసిన కళ్ళతో మెగాస్టార్ కు బర్త్ డే విషెస్ చెప్పాలనుకున్నాడు. అందరి కంటే డిఫరెంట్ గా ఉండాలనుకున్నా కుప్పం కళాకారుడు వినూత్న ప్రయత్నం చేశాడు. నెమలి ఈకపై చిరు చిత్రానికి ప్రాణం పోశాడు. కుప్పం పూరి ఆర్ట్స్ పురుషోత్తం నెమలి ఈకపై వేసిన చిరు చిత్రం అభిమానులను ఆకట్టుకుంది. నెమలి ఈకపై మెగాస్టార్ వింటేజ్ చిత్రాన్ని పెయింటింగ్ వేసి బర్త్ డే విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టు చేసాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఫోటోలను చూసిన మెగాస్టార్ అభిమానులు పురుషోత్తమ్ ను అభినందిస్తున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ హీరో మాములోడు కాదు.. నెంబర్ వన్ ఫ్రాడ్.. సీనియర్ నటుడు సురేష్..
ఈ మైక్రో ఆర్ట్ సామాజిక మాధ్యమాల్లో విశేషంగా వైరల్ అవుతోంది. ఈ వినూత్న కళాఖండాన్ని చూసిన మెగా అభిమానులు, నెటిజన్లు ఆ కళాకారుడి ప్రతిభను, ఓర్పును ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కళాకారుడు తయారు చేసిన ఈ వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. అభిమానం ఉంటే చాలు, ఏ మాధ్యమమైనా అద్భుతమైన కళగా మారుతుందని ఈ కుప్పం ఆర్టిస్ట్ మరోసారి నిరూపించారు.
ఎక్కువ మంది చదివినవి : Sowcar Janaki: షావుకారు జానకి మనవరాలు తెలుగులో పెద్ద హీరోయిన్.. చాలా ఫేమస్.. ఎవరో
Chiranjeevi
ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: రహస్య బావిలో మహిళ అరుపులు.. భయంతో వణికిపోవాల్సిందే.. ఓటీటీని ఊపేస్తున్న హారర్ థ్రిల్లర్..