Ghani Movie: ముకుందతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమ్యాడు మెగా ప్రిన్స్ వరుణ తేజ్ (Varun Tej). ఆతర్వాత కంచె సినిమాతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఫిదా, తొలిప్రేమ సినిమాలతో లవర్‌బాయ్‌గా అమ్మాయిల మనసులు గెల్చుకున్నాడు. ఆతర్వాత ఎఫ్2 తన కామెడీతో నవ్వులు పూయించాడు. కాగా మొదటి నుంచి కథల ఎంపికలో వైవిధ్యతను ప్రదర్శిస్తోన్న ఈ మెగా హీరో అంతరిక్షం, గద్దల కొండ గణేశ్ లాంటి ప్రయోగాత్మక సినిమాలు చేసి విజయాలు అందుకున్నాడు. అలా ఈసారి స్పోర్ట్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గని (Ghani )తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడీ హ్యాండ్సమ్ హీరో. ఏప్రిల్ 8న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కలెక్షన్లు కూడా పడిపోయాయి. ఈక్రమంలో గని సినిమాపై వరుణ్ స్పందించాడు. సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ నోట్ పెట్టాడు.
అనుకున్న రీతిలో చూపించలేకపోయాం!
‘మీరు ఎన్నో ఏళ్లుగా నాపై ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు. అందుకు నేను రుణపడి ఉంటాను. గని మూవీ నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ, మరీ ముఖ్యంగా నిర్మాతలకు చాలా థ్యాంక్స్. ఈ సినిమా కోసం వారెంతో శ్రమించారు. ఒక మంచి సినిమాను మీ ముందుకు తీసుకురావాలనే ప్రయత్నంతో మేం చాలా కష్టపడ్డాం. కానీ మా ఆలోచనలను అనుకున్నరీతిలో స్ర్కీన్‌పై చూపించలేకపోయాం. మిమ్మల్ని వందశాతం ఎంటర్‌టైన్ చేయాలనే ఉద్దేశ్యంతోనే నేను ప్రతి సినిమా చేస్తాను. ఈ క్రమంలో కొన్నిసార్లు విజయం సాధిస్తాను. మరికొన్నిసార్లు సినిమా ఫలితాల నుంచి నేర్చుకుంటాను. ఏదేమైనా కష్టపడి పనిచేయడం మాత్రం ఆపను’ అంటూ నోట్‌లో రాసుకొచ్చాడు మెగాప్రిన్స్. కాగా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో సయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది. కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతిబాబు, నదియా కీలక పాత్రలు పోషించారు.
Also Read: Viral News: ఒకే చెట్టుకు 1200కు పైగా టమాటాలు.. గిన్నిస్ బుక్‌లో చోటు.. ఎక్కడో తెలుసా?
Kishan Reddy: ఏపీ, కర్ణాటకకు లేని సమస్య మీకెందుకు..? తెలంగాణ సర్కార్‌కు కిషన్‌రెడ్డి సూటి ప్రశ్న
CUET 2022 రద్దుకు శాసనసభ తీర్మానం.. కేంద్రానికి తమిళనాడు ముఖ్యమంత్రి అభ్యర్ధన!