మెగా హీరో కోసం 200 కిలోమీటర్ల పాదయాత్ర.. ఆ అభిమాని కోసం హీరో ఏం చేశాడో తెలుసా ?

|

Jan 31, 2021 | 10:56 AM

సాధరణంగా తమ ఫెవరెట్ హీరోలను కలవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక తమ హీరో సినిమా విడుదలైనా.. లేదా పుట్టిన రోజు ఫ్యాన్స్ చేసే హడావిడి మాములుగా ఉండదు. తాజాగా ఓ

మెగా హీరో కోసం 200 కిలోమీటర్ల పాదయాత్ర.. ఆ అభిమాని కోసం హీరో ఏం చేశాడో తెలుసా ?
Follow us on

సాధరణంగా తమ ఫెవరెట్ హీరోలను కలవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక తమ హీరో సినిమా విడుదలైనా.. లేదా పుట్టిన రోజు ఫ్యాన్స్ చేసే హడావిడి మాములుగా ఉండదు. తాజాగా ఓ అభిమాని తన ఫెవరెట్ హీరో కోసం ఏకంగా 200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు.

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బిక్కనూరు ప్రాంతానికి చెందిన బాలు అనే యువకుడు .. తన అభిమాన హీరో వరుణ్ తేజ్ కోసం హైదరాబాద్‏కు నడిచి వచ్చాడు. దాదాపు 200 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్న అతడి గురించి తెలుసుకున్న వరుణ్ తేజ్.. ఆ అభిమానిని కలిసి అతడిని సంతోషపరచాడు. అంత దూరం నుంచి వచ్చిన అభిమానితో కొద్ది సమయం కూర్చొని మాట్లాడాడు. అనంతరం అతని ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నాడు. ఇలాంటి సాహసాలు మళ్లీ చేయవద్దని సున్నితంగా హెచ్చరించాడు. ఇక తనకు ఎంతగానో ఇష్టమైన హీరోను కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని.. ఇందుకోసం పడిన కష్టం అంతా కూడా వరుణ్ తేజ్‏ను చూడగానే మరిచిపోయానని బాలు చెప్పాడు. ఇక గతంలో కూడా చాలా మంది ఫ్యాన్స్ తమ అభిమానులను కలవడానికి ఇలాంటి సాహసాలే చేశారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ ‘గని’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా జూలై 30న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది.

Also Read:

Pawan Kalyan : భారీ బడ్జెట్‌‌‌తో రానున్న పవన్- క్రిష్ మూవీ… మొగలాయిల కాలం నాటి కథ నేపథ్యంలో సినిమా..