మాస్‌రాజా సినిమాలో మెగా హీరో అతిథి పాత్ర..!

ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్‌ సినిమాలో నటిస్తోన్న మాస్‌రాజా రవితేజ.. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తదుపరి చిత్రంలో నటించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాగా ఈ మూవీలో మరో కీలకపాత్ర ఉందట. అందుకోసం మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ పేరును మేకర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 20 నిమిషాల నిడివి గల ఈ పాత్రకు అతడు కరెక్ట్‌గా సరిపోతాడని దర్శకనిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అతడితో సంప్రదింపులు […]

మాస్‌రాజా సినిమాలో మెగా హీరో అతిథి పాత్ర..!

Edited By:

Updated on: May 17, 2020 | 5:36 PM

ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్‌ సినిమాలో నటిస్తోన్న మాస్‌రాజా రవితేజ.. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తదుపరి చిత్రంలో నటించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాగా ఈ మూవీలో మరో కీలకపాత్ర ఉందట. అందుకోసం మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ పేరును మేకర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 20 నిమిషాల నిడివి గల ఈ పాత్రకు అతడు కరెక్ట్‌గా సరిపోతాడని దర్శకనిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అతడితో సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా టాక్‌. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా మరోవైపు గతేడాది రెండు విజయాలతో జోరు మీదున్న సాయి ధరమ్‌ తేజ్., ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటర్‌లో నటిస్తున్నారు. లాక్‌డౌన్‌ తరువాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read This Story Also:  సిక్కు వ్యక్తి అంత్యక్రియలు చేసి.. మానవత్వం చాటుకున్న ముస్లింలు..!