AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ సినిమాలు.. ఇప్పుడు అపార్ట్‏మెంట్ వాచ్‏మెన్‏గా పనిచేస్తున్న నటుడు..

సినీరంగుల ప్రపంచంలో ఎప్పుడు ఎవరి జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందో అస్సలు చెప్పలేము. నటీనటులుగా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని సినీరంగంలోకి అడుగుపెడుతుంటారు. ఒకటి రెండు చిత్రాలతోనే పాపులర్ అవుతుంటారు. కానీ చివరకు ఊహించని విధంగా ఇండస్ట్రీకి దూరమవుతారు. అలాంటివారిలో ఈ నటుడు ఒకరు.

Tollywood : స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ సినిమాలు.. ఇప్పుడు అపార్ట్‏మెంట్ వాచ్‏మెన్‏గా పనిచేస్తున్న నటుడు..
Savi Sidhu
Rajitha Chanti
|

Updated on: Aug 27, 2026 | 8:12 PM

Share

సినీ రంగుల ప్రపంచం కొందరికి నక్షత్రాల హోదాను ఇస్తే, మరికొందరికి ఊహించని కష్టాలను మిగులుస్తుంది. అక్షయ్ కుమార్, రిషి కపూర్ వంటి అగ్ర కథానాయకులతో నటించిన బాలీవుడ్ నటుడు సావి సిధూ. అతడి జీవితంలో చోటుచేసుకున్న పరిణామాలు దీనికి నిదర్శనం. లక్నోలో జన్మించిన సావి సిధూ, చండీగఢ్‌లో మోడలింగ్ చేసిన అనంతరం చట్ట విద్యను (Law) అభ్యసిస్తూ థియేటర్ వైపు అడుగులు వేశారు. 1995లో ‘తాకత్’ సినిమాతో బాలీవుడ్ ప్రవేశం చేశారు. ఆయన ప్రతిభను గుర్తించిన ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తన ‘బ్లాక్ ఫ్రైడే’ (2007), ‘గులాల్’ (2009) చిత్రాల్లో మంచి పాత్రలు ఇచ్చారు. ఆ తర్వాత అక్షయ్ కుమార్‌తో ‘పాటియాలా హౌస్’ (2011), ‘డి-డే’ (2013), ‘బేవర్కూఫియాన్’ (2014) వంటి విజయవంతమైన సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : 3 సీజన్స్.. 33 ఎపిసోడ్స్.. 6 సంవత్సరాలుగా ఓటీటీని శాసిస్తున్న సిరీస్.. ఇప్పటికీ తెగ డిమాండ్..

2014లో వచ్చిన ‘బేవర్కూఫియాన్’ తర్వాత ఆయన అనారోగ్య సమస్యలు , కుటుంబంలో చోటుచేసుకున్న వరుస విషాదాల వల్ల సినిమాలకు దూరమయ్యారు. ఒకరివెంట ఒకరుగా ఆయన భార్య, తండ్రి, తల్లి, అత్తమామలు కన్నుమూశారు. కుటుంబంలో అందరినీ కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయిన సావి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు.

ఎక్కువ మంది చదివినవి :  Bigg Boss : నన్ను వాడుకుని వదిలేశాడు.. టార్చర్ చేశాడు.. అందుకే చచ్చిపోవాలనుకున్నా.. బిగ్ బాస్ బ్యూటీ..

ఆర్థిక ఇబ్బందుల వల్ల ముంబైలోని లోఖండ్‌వాలా (అంధేరీ వెస్ట్) లోని ఒక అపార్ట్‌మెంట్‌లో రోజుకు 12 గంటలు సెక్యూరిటీ గార్డ్‌గా పని చేయడం ప్రారంభించారు. కనీసం బస్సు టికెట్ కొనడానికి, థియేటర్‌లో సినిమా చూడటానికి కూడా డబ్బులు లేని స్థితికి చేరుకున్నారు. ఆయన పరిస్థితి గురించి ‘ఫిల్మ్ కంపానియన్’ ఇంటర్వ్యూ ద్వారా తెలిసినప్పుడు, రాజ్‌కుమార్ రావు, అనురాగ్ కశ్యప్, మీకా సింగ్ వంటి ప్రముఖులు ఆయనకు మద్దతుగా నిలిచారు. జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా హుందాగా బ్రతుకుతున్న సావి సిధూ ప్రయాణం అనేకమందికి కంటతడి పెట్టిస్తుంది.

ఎక్కువ మంది చదివినవి : Jabardasth : రామోజీ ఫిల్మ్ సిటీలో హోటల్ ఇండస్ట్రీలో నాతో పనిచేశాడు.. ఇప్పుడు క్రేజీ హీరో.. జబర్దస్త్ నటుడు..

నటుడు సావి సిద్ధు..

Savi Sidhu

Savi Sidhu

ఎక్కువ మంది చదివినవి : Tollywood: అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో పెద్ద నటుడు.. గవర్నమెంట్ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి ఎందుకు వచ్చారంటే..

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..