‘రెంట్‌ చెల్లిద్దామని వెళితే, డబ్బులు వద్దు నాతో గడపమన్నాడు’.. చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్న నటీమణి.

|

Dec 19, 2022 | 7:34 PM

క్యాస్టింగ్‌ కౌచ్‌ అంశం సినిమా ఇండస్ట్రీని ఎంతలా షేక్‌ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ వరకు నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాన్ని బహిరంగంగానే ప్రకటిస్తూ అందరినీ షాక్‌కి గురి చేశారు. ఇదే సమయంలో కొందరు నటీమణులు ఈ క్యాస్టింగ్..

రెంట్‌ చెల్లిద్దామని వెళితే, డబ్బులు వద్దు నాతో గడపమన్నాడు.. చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్న నటీమణి.
Tejaswini Pandit
Follow us on

క్యాస్టింగ్‌ కౌచ్‌ అంశం సినిమా ఇండస్ట్రీని ఎంతలా షేక్‌ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ వరకు నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాన్ని బహిరంగంగానే ప్రకటిస్తూ అందరినీ షాక్‌కి గురి చేశారు. ఇదే సమయంలో కొందరు నటీమణులు ఈ క్యాస్టింగ్ కౌచ్‌ కేవలం సినిమా ఇండస్ట్రీకే పరిమితం కాదని ఇతర రంగాల్లోనూ ఉంటుందని తెలిపారు. ఈ క్రమంలోనే తాజాగా మరాఠీ నటి తేజస్విని పండిట్ తన జీవితంలో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని పంచుకున్నారు. హీరోయిన్లకు సినిమా వాళ్ల నుంచే కాకుండా బయటి వ్యక్తుల నుంచి చేదు అనుభవాలను ఎదురవుతాయని తేజస్విని తెలిపారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజస్విని తన కెరీర్‌ తొలి నాళ్లలో ఎదురైన చేదు జ్ఞాపకాన్ని పంచుకున్నారు. 2009-10 ప్రాంతంలో పుణెలోని ఓ అపార్ట్‌మెంట్‌లో తేజస్విని అద్దెకు ఉన్న సమయంలో ఈ సంఘటన జరిగిందని తెలిపింది. ఈ విషయమై తేజస్విని మాట్లాడుతూ.. ‘అప్పట్లో నా సినిమాలు ఒకటి రెండు మాత్రమే విడుదలయ్యాయి. అపార్ట్‌మెంట్‌ ఓ కార్పొరేటర్‌కు చెందినది. ఒకసారి నేను అద్దె చెల్లించడానికి అతని కార్యాలయానికి వెళ్లాను. ఆ సమయంలో ఆయన ఫేవర్‌ చేయమని నేరుగా అడిగాడు. అద్దెకు బదులు ఇంకేదో అడిగాడు’ అని చెప్పుకొచ్చింది.

ఆ అపార్ట్‌మెంట్‌ యజమాని అలా అనగానే తేజస్విని వెంటనే అక్కడ టేబుల్‌పై నీటితో ఉన్న గ్లాసును తీసుకొని అతని ముఖంపై విసిరినట్లు తెలిపింది. అలాంటి పనులు చేయడానికి ఈ వృత్తిలోకి రాలేనని, అలా చేసి ఉంటే ఇలాంటి అద్దె అపార్ట్‌మెంట్‌లో ఉండే అవసరం రాదని యజమానికి చెడపెడ వాయించేసినట్లు గుర్తు చేసుకుంది. ప్రస్తుతం తేజస్విని ఓ వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..