కరోనా వారియర్స్ పట్ల మానుషి దాతృత్వం

| Edited By:

Aug 20, 2020 | 10:20 AM

కరోనా సమయంలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌ మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్‌ దాతృత్వాన్ని చాటుకున్నారు. వారికి చేయూతనందించేందుకు

కరోనా వారియర్స్ పట్ల మానుషి దాతృత్వం
Follow us on

Manushi Chhillar paintings: కరోనా సమయంలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌ మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్‌ దాతృత్వాన్ని చాటుకున్నారు. వారికి చేయూతనందించేందుకు ఫ్రంట్స్‌లైన్‌ వారియర్స్‌పై వేసిన పెయింటింగ్స్‌ను వేలం వేయబోతున్నట్లు మానుషి ప్రకటించారు. స్మైల్‌ స్వచ్చంద సంస్థతో కలిసి ఆన్‌లైన్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ ద్వారా వాటిని అమ్మనున్నారు. ఆ డబ్బును కరోనా వారియర్స్‌తో పాటు వారి కుటుంబాలకు పీపీఈ కిట్లు అందించేందుకు ఉపయోగించనున్నట్లు మానుషి తెలిపారు.

కరోనా సమయంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా మనల్ని మనం కాపాడుకుంటున్నాం. అయితే రైతులు, ట్రక్ డ్రైవర్లతో పాటు చాలా మంది కార్మికులు వారి ప్రాణాలను సైతం పణంగా పెట్టి రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. వారి కోసం స్మైల్ ఫౌండేషన్ ద్వారా పీపీఈ కిట్లు అందించనున్నాం అని మానుషి చిల్లర్ వెల్లడించారు. కాగా మానుషి ప్రస్తుతం బాలీవుడ్‌లో సినిమాలను చేస్తోన్న విషయం తెలిసిందే.

Read More:

హైదరాబాద్‌ డ్రగ్స్ మాఫియా.. వెలుగులోకి కొత్త విషయాలు

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,724 కొత్త కేసులు.. 10 మరణాలు