kpac lalitha: మలయాళ నటి కేపీఏసీ లలిత ఇకలేరు. ఎన్నో చిత్రాల్లో నటించి అశేష అభిమానులు సొంతం చేసుకున్న ఈ లెజెండరీ నటీమణి మంగళవారం కేరళలోని త్రిపుణితురలో తుది శ్వాస విడిచారు. అనారోగ్యం బారిన పడిన లలిత గత కొన్ని రోజుల క్రితం ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలోనే చికిత్స తీసుకుంటున్న లలిత ఆరోగ్యం విషమించడంతో మంగళవారం రాత్రి కన్ను మూశారు. లలిత అంత్యక్రియలను బుధవారం సాయంత్రం నిర్వహించనున్నారు.
1947 జనవరి 25న జన్మించిన లలిత.. సినిమాల్లోకి రాకముందు లలిత కేరళలో థియేటర్ ఆర్టిస్ట్‌గానే ఎంతో పేరు సంపాదించుకున్నారు. కేపీఏసీ లలిత అసలు పేరు మహేశ్వరి అమ్మ. కేరళ పీపుల్స్ ఆర్ట్స్ క్లబ్ లో (కేపీఏసీ) చేరిన తర్వాత తన పేరును లలితగా మార్చుకున్నారు. దీంతో సినిమాల్లోకి వెళ్లిన తర్వాత ఆమె పేరు కేపీఏసీ లలితగా మారింది. లలిత తన సినీ కెరీర్‌లో మొత్తం 550కిపై చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆమె అద్భుత నటనకు ఎన్నో అవార్డులు దక్కాయి. ఉత్తమ సహాయ నటి విభాగంలో రెండు సార్లు జాతీయ అవార్డుతో పాటు నాలుగు రాష్ట్ర స్థాయి అవార్డులను అందుకున్నారు. నటిగా గుర్తింపు సంపాదించుకునే కంటే ముందు లలితా గాయనిగా కూడా రాణించారు.
లలిత మరణంపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. లలిత మరణంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు. తన నటనతో విభిన్న తరాల ప్రేక్షకులను ఆకట్టుకున్న లలిత చరిత్రలో నిలిచిపోయారన్నారు. నటి కీర్తి సురేష్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘లెజండరీ యాక్టర్ లలితా ఆంటీ ఇక లేరన్న వార్త బాధించింది. వారి కుటుంబానికి నా సానుభూతి తెలియజేస్తున్నాను’ అంటూ రాసుకొచ్చారు.
Extremely saddened to hear about the passing of the legendary KPAC Lalitha aunty.
My heartfelt condolences to the family. pic.twitter.com/nGqxO5tpGb
— Keerthy Suresh (@KeerthyOfficial) February 22, 2022
Also Read: Startup Companies: భారీగా పడిపోయిన స్టార్టప్ కంపెనీల షేర్లు.. ఎందుకు ఇలా జరుగుతోంది..
విజయ్ దేవరకొండ పిరికోడు !! హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ !! వీడియో