“మహర్షి” హిట్ పై ప్రిన్స్ మహేష్ ట్విట్టర్‌లో స్పందించారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్‌తో దూసుకెళ్తూ.. ప్రేక్షకులని అలరిస్తోంది ఈ చిత్రం. మహేష్ బాబు, పూజా హెగ్డే, అల్లరి నరేష్ ప్రధాన పాత్రలలో వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమా చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మహేష్ 25వ చిత్రంగా తెరకెక్కిన మహర్షి ఇంత పెద్ద విజయం సాధించడం పట్ల మహేష్ ఆనందం వ్యక్తం చేస్తూ చిత్ర యూనిట్‌తో పాటు అభిమానులు, ప్రేక్షకులకి కృతజ్ఞతలు తెలిపారు
నా జర్నీలో మహర్షి చిత్రం ప్రత్యేకమైనది కాగా, ఈ చిత్రాన్ని ఇంత పెద్ద హిట్ చేసినందుకు అభిమానులకి, సినీ ప్రియులకి ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు. నా చిత్ర బృందం, మహర్షి డైరెక్టర్ వంశీ పైడిపల్లి మరియు నా తరపున ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని కామెంట్ చేశారు.
My journey so far has been very special & Thank You All for making my 25th… my BIGGEST!!! Thanking all my fans and the audiences for an outstanding response.
— Mahesh Babu (@urstrulyMahesh) May 10, 2019
My amazing team of #Maharshi, my director @directorvamshi and I, THANK YOU ALL from the bottom of our hearts for this overwhelming success ???
— Mahesh Babu (@urstrulyMahesh) May 10, 2019