రూల్ బ్రేక్ చేయబోతున్న మహేశ్..?

ఓ వైపు సినిమాలతో, మరోవైపు బిజినెస్‌తో ఫుల్ బిజీగా గడిపేస్తున్న సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఇప్పుడు తన రూల్‌ను బ్రేక్ చేయబోతున్నట్లు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక సినిమా పూర్తైతే గానీ మరో సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లని ఈ హీరో ఇప్పుడు రెండు ప్రాజెక్ట్‌లలో ఒకేసారి నటించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన డేట్లను మహేశ్ అడ్జెస్ట్ చేస్తున్నట్లు టాక్. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షిలో నటిస్తోన్న మహేశ్.. ఆ తరువాత సుకుమార్‌కు ఓకే చెప్పాడు. […]

రూల్ బ్రేక్ చేయబోతున్న మహేశ్..?

Edited By:

Updated on: Mar 04, 2019 | 10:42 AM

ఓ వైపు సినిమాలతో, మరోవైపు బిజినెస్‌తో ఫుల్ బిజీగా గడిపేస్తున్న సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఇప్పుడు తన రూల్‌ను బ్రేక్ చేయబోతున్నట్లు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక సినిమా పూర్తైతే గానీ మరో సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లని ఈ హీరో ఇప్పుడు రెండు ప్రాజెక్ట్‌లలో ఒకేసారి నటించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన డేట్లను మహేశ్ అడ్జెస్ట్ చేస్తున్నట్లు టాక్.

ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షిలో నటిస్తోన్న మహేశ్.. ఆ తరువాత సుకుమార్‌కు ఓకే చెప్పాడు. అయితే సుకుమార్ స్క్రిప్ట్ ఇంకా పూర్తి చేయకపోవడం.. ఈ లోపు అనిల్ రావిపూడి కథ చెప్పి మహేశ్‌తో ఒప్పించుకోవడం జరిగాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో అనిల్ రావిపూడితో మహేశ్ సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు కూడా టాక్ వినిపించింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ రెండు సినిమాలను మహేశ్ ఒకేసారి సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడట. వీటికి సంబంధించిన పూజా కార్యక్రమాలను మహేశ్ త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే మహేశ్ అభిమానులకు శుభవార్తే.