
మొత్తం ఇచ్చేస్తా.. మీరేదైతే అనుకుంటున్నారో.. మహేష్‌ను ఎలా చూడాలని కలలు కంటున్నారో అచ్చంగా అలాగే చూపిస్తా.. వడ్డీతో సహా బ్లాక్‌బస్టర్ బాకీ చెల్లిస్తా అంటున్నారు త్రివిక్రమ్. గుంటూరు కారం అప్‌డేట్స్ రావట్లేదని మహేష్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారేమో గానీ సినిమాలో మాత్రం మ్యాటర్ ఓ రేంజ్‌లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు గురూజీ. ఇంతకీ గుంటూరు కారం కోసం ఆయనేం చేస్తున్నారో తెలుసా..?
కొన్ని కాంబినేషన్స్ వస్తున్నాయంటే అంచనాలు మామూలుగా ఉండవు.. మహేష్, త్రివిక్రమ్ కూడా అలాంటిదే. నిజం మాట్లాడుకుంటే.. ఈ కాంబోలో వచ్చిన రెండు సినిమాలు బ్లాక్‌బస్టర్ కాదు.. కానీ క్లాసిక్స్. అటు అతడు తీసుకున్నా.. ఇటు ఖలేజా చూసుకున్నా రెండూ కల్ట్ సినిమాలే. కలెక్షన్‌లతో పనిలేకుండా ఆడియన్స్ ఎప్పటికీ గుర్తుంచుకునే సినిమాలుగా నిలిచిపోయాయి ఆ రెండూ.
12 ఏళ్ళ తర్వాత కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో గుంటూరు కారంపై ముందు నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఎప్పటికప్పుడు కొన్ని కారణాలతో ఈ సినిమా ఆలస్యమవుతూ వస్తుంది. కానీ కొన్నిసార్లు ఆలస్యం కూడా మంచిదే. కంగారుగా ఏదో ఒకటి చేయడం కంటే.. నెమ్మదైనా అనుకున్నది అనుకున్నట్లు చేయొచ్చు. గుంటూరు కారం విషయంలో గురూజీ ఇదే చేస్తున్నారు. వింటేజ్ మహేష్‌ను తీసుకొస్తున్నారు. ఈ సినిమా కోసం 17 ఏళ్ళ తర్వాత స్మోకింగ్ సీన్ చేసారు మహేష్. డాన్సుల విషయంలోనూ తగ్గేదే లే అంటున్నారు.. హెయిర్ స్టైల్ పోకిరి, అతిథి సినిమాలను తలపిస్తుంది.. లుక్స్ పరంగానూ మేకోవర్ అదిరిపోయింది. అన్నింటికీ మించి కబడ్డీ సీక్వెన్స్ ఉండబోతుంది. ఒక్కడులో కబడ్డీతో రికార్డులు తిరగరాసారు మహేష్. గుంటూరు కారంలో మరోసారి కబడ్డి పట్టు చూపించబోతున్నారు. మొత్తానికి మహేష్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టాలని ఫిక్సైపోయారు త్రివిక్రమ్.