ఈ హాలీడే మరింత ప్రత్యేకం: మహేశ్

సూపర్‌స్టార్ మహేశ్ బాబు తన కుటుంబంతో మరో హాలిడే ట్రిప్‌కు వెళ్తున్నారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించాడు మహేశ్. ‘‘మరో గుర్తుండిపోయే హాలీడేకు వెళ్తున్నాం. ఇది మరింత స్పెషల్’’ అంటూ ట్వీట్ చేసిన ఆయన సెలబ్రేటింగ్ మహర్షి అని హ్యాష్‌ట్యాగ్ ఇచ్చారు. Off to another memorable holiday… This one is special…♥♥#CelebratingMaharshi pic.twitter.com/aB3XqQfJbS — Mahesh Babu (@urstrulyMahesh) May 20, 2019 కాగా మహేశ్ నటించిన 25వ ప్రతిష్టాత్మక […]

ఈ హాలీడే మరింత ప్రత్యేకం: మహేశ్

Edited By:

Updated on: May 20, 2019 | 4:09 PM

సూపర్‌స్టార్ మహేశ్ బాబు తన కుటుంబంతో మరో హాలిడే ట్రిప్‌కు వెళ్తున్నారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించాడు మహేశ్. ‘‘మరో గుర్తుండిపోయే హాలీడేకు వెళ్తున్నాం. ఇది మరింత స్పెషల్’’ అంటూ ట్వీట్ చేసిన ఆయన సెలబ్రేటింగ్ మహర్షి అని హ్యాష్‌ట్యాగ్ ఇచ్చారు.

కాగా మహేశ్ నటించిన 25వ ప్రతిష్టాత్మక చిత్రం ‘మహర్షి’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విద్యార్థిగా, బిజినెస్‌మ్యాన్‌గా, రైతుగా మహేశ్ అందరినీ ఆకట్టుకున్నాడు. విడుదలైన రోజు నుంచి ప్రతిచోట ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో పాటు బాక్సాఫీస్ వద్దా తన సత్తా చాటుతున్నాడు మహర్షి. దీంతో మహేశ్‌తో పాటు టీం మొత్తం ఫుల్ ఖుషీలో ఉంది. ఇదిలా ఉంటే ఈ హాలీడే నుంచి వచ్చిన తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్ తదుపరి సినిమా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.