Mahesh Babu: మహేష్‌‌పై పడి ఏడుస్తోన్న బాలీవుడ్..!

| Edited By:

Feb 24, 2020 | 7:52 PM

సూపర్‌స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్సాల్సిన అవసరం లేదు. కృష్ణ వారసుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు మహేష్. అంతేకాదు ఈ హీరోకు కేవలం తెలుగులోనే కాదు అటు కోలీవుడ్, ఇటు శాండిల్‌వుడ్‌లోనూ మంచి క్రేజ్ ఉంది. ఇదంతా పక్కనపెడితే మహేష్ వల్ల ఇప్పుడు బాలీవుడ్ నిర్మాతలు ఇబ్బందులు పడుతున్నారట. అదేంటి..! మహేష్‌తో ఏ బాలీవుడ్ సినిమాను ఒప్పుకోలేదు కదా..! పోనీ తన సినిమాలను అక్కడ డబ్ […]

Mahesh Babu: మహేష్‌‌పై పడి ఏడుస్తోన్న బాలీవుడ్..!
Follow us on

సూపర్‌స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్సాల్సిన అవసరం లేదు. కృష్ణ వారసుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు మహేష్. అంతేకాదు ఈ హీరోకు కేవలం తెలుగులోనే కాదు అటు కోలీవుడ్, ఇటు శాండిల్‌వుడ్‌లోనూ మంచి క్రేజ్ ఉంది. ఇదంతా పక్కనపెడితే మహేష్ వల్ల ఇప్పుడు బాలీవుడ్ నిర్మాతలు ఇబ్బందులు పడుతున్నారట. అదేంటి..! మహేష్‌తో ఏ బాలీవుడ్ సినిమాను ఒప్పుకోలేదు కదా..! పోనీ తన సినిమాలను అక్కడ డబ్ చేసి విడుదల చేయలేదు. మరి ఈ సూపర్‌స్టార్‌ ఆ నిర్మాతలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అనుకుంటున్నారా..!

అసలు మ్యాటరేంటంటే..! సరిలేరు నీకెవ్వరు కోసం మహేష్ బాబు రూ.50కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారట. ఈ విషయం బాలీవుడ్ స్టార్ నటుల వరకు వెళ్లిందట. ప్రస్తుతం ఆయన మార్కెట్ రూ.150కోట్లు ఉండగా.. అందులో 1/3వంతు రెమ్యునరేషన్ తీసుకోవడం వారిని ఆశ్చర్యానికి గురి చేసిందట. ఒక ప్రాంతీయ హీరోనే అంత తీసుకోవడంతో ఇక్కడ మార్కెట్‌కు తగ్గట్లుగా తమ రెమ్యునరేషన్ ఉండాలని వారు నిర్మాతలకు డిమాండ్ పెడుతున్నారట. ఈ క్రమంలో ఒక్కో స్టార్ హీరో రూ.300 నుంచి రూ.500 కోట్లు డిమాండ్ చేస్తున్నారట. దీంతో నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారట.

అయినా మరీ హాస్యాస్పదం కాకపోతే.. ఎవరి మార్కెట్‌ స్టామినాను బట్టి వారు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తారు. ఒకవేళ ఆ హీరోలకు అంత స్టామినా లేకపోతే నిర్మాతలు కూడా సినిమాలు చేసేందుకు జంకుతారు. ఇక మహేష్ స్టామినా ఏంటో మన టాలీవుడ్ ప్రేక్షకులకు, నిర్మాతలకు, దర్శకులకు బాగా తెలుసు. ఇంకా చెప్పాలంటే మహేష్‌ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే వారిలో కోలీవుడ్‌లోనూ ఉన్నారు. ఏదేమైనా సినిమా కంటెంట్‌ల మీద దృష్టి పెట్టకుండా.. ప్రాంతీయ హీరోల రెమ్యునరేషన్‌పై పడి ఏడవడం ఏంటని కొందరు సినీ విశ్లేషకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.