మహేష్ బాబు హీరోగా నటించిన సందేశాత్మక చిత్రం ‘మహర్షి’ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈనెల 9న విడుదలైన ఈ చిత్రం తొలి నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు నిర్మాతలు వెల్లడించారు. ఇప్పుడు వారం రోజులు పూర్తికాక ముందే మహేష్ బాబు కెరీర్‌లోనే అత్యధిక గ్రాస్ వసూలు చేసిన చిత్రంగా రికార్డు సృష్టించిందని ప్రకటించారు. ఈ మేరకు ‘మహర్షి’ సినిమా నిర్మాణ సంస్థల్లో ఒకటైన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
End of a sensational week at the Box Office. Super Star @urstrulymahesh's biggest grosser within a week's time. #Maharshi @directorvamshi @hegdepooja @allarinaresh @ThisisDSP @KUMohanan1 @Cinemainmygenes @ShreeLyricist #SSMB25 pic.twitter.com/5QyV3flyBX
— Sri Venkateswara Creations (@SVC_official) May 16, 2019