Entertainment: ఈ వారం థియేటర్‌/ఓటీటీల్లో అలరించనున్న సినిమాలివే..

|

Nov 08, 2021 | 11:38 AM

కరోనా ప్రభావం క్రమంగా తగ్గడంతో ప్రేక్షకులు సినిమా థియేటర్లకు క్యూ కడుతున్నారు. దీంతో తమ సినిమాలను విడుదల చేసేందుకు దర్మక నిర్మాతలు రంగం సిద్ధం చేసుకుంటున్నారు..

Entertainment: ఈ వారం థియేటర్‌/ఓటీటీల్లో అలరించనున్న సినిమాలివే..
Follow us on

కరోనా ప్రభావం క్రమంగా తగ్గడంతో ప్రేక్షకులు సినిమా థియేటర్లకు క్యూ కడుతున్నారు. దీంతో తమ సినిమాలను విడుదల చేసేందుకు దర్మక నిర్మాతలు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇటీవల దీపావళి పండగ సందర్భంగా విడుదలైన చిత్రాలు సినీ ప్రియులను బాగా అలరించాయి. దీంతో పండగ ఊపును కొనసాగిస్తూ్ ఈ వారం కూడా మరికొన్ని సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. అలాగే మరికొన్ని చిత్రాలు ఓటీటీ ద్వారా విడుదల కానున్నాయి. మరి అవేంటో చూద్దాం రండి.

ఏజెంట్‌గా వస్తోన్న కార్తికేయ..
కార్తికేయ, తాన్యా రవిచంద్రన్‌ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రాజా విక్రమార్క’. సాయికుమార్‌, తనికెళ్ల భరణి, సుధాకర్‌ కోమాకుల కీలక పాత్రలు పోషించారు. ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్‌ను చూస్తుంటే యాక్షన్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్‌కు పెద్ద పీట వేసినట్లు తెలుస్తోంది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్‌ 12న థియేటర్లలో విడుదల కానుంది.

భార్య వేరేవారితో వెళ్లిపోతే..
ఆనంద్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘పుష్పక విమానం’. విజయ్‌ దేవరకొండ సమర్పకుడిగా వ్యవహరిస్తోన్న ఈ చిత్రంలో శాన్విమేఘన హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ సినీ ప్రియులను బాగానే ఆకట్టుకుంది. పెళ్లయిన తర్వాత భార్య వేరే వాళ్లతో వెళ్లిపోతే ఓ ఉపాధ్యాయుడికి ఎదురైన పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా ఈనెల 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘కురుప్‌’ గా దుల్కర్‌ సల్మాన్‌
ఒకప్పటి మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ ‘కురుప్‌’ జీవితకథతో తెరకెక్కిన చిత్రం ‘కురుప్‌’. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటిస్తున్నాడు. పాన్‌ ఇండియా సినిమాగా రూపొందించిన ఈ చిత్రం ట్రైలర్‌ ఇటీవలే విడుదలైంది. ఇందులో కురుప్‌, గోపీ కృష్ణన్‌ అనే రెండు విభిన్న పాత్రలను పోషించాడు దుల్కర్‌. క్రిమినల్‌ను పట్టుకునేందుకు పోలీసులు ఎలాంటి ప్లాన్లు వేశారు? వాటి నుంచి కురుప్‌ ఎలా తప్పించుకున్నాడు? అని తెలుసుకోవాలంటే ఈ నెల 12 న థియేటర్‌కు వెళ్లి ఈ సినిమాను చూడాల్సిందే.

వీటితో పాటు శ్రీకాంత్‌ ప్రధాన పాత్రలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘తెలంగాణ దేవుడు’, ప్రముఖ కన్నడ నటుడు కిచ్చా సుదీప్‌ నటించిన ‘కే3.. కోటికొక్కడు’ , ఆమని, గౌతమ్‌ రాజు నటిస్తోన్న ‘ది ట్రిప్‌’ నవంబర్‌ 12 న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ఓటీటీలో రాబోతున్న సినిమాలివే..
పాయల్‌ రాజ్‌పుత్‌, ఈషా రెబ్బా, పూర్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న వెబ్‌సిరీస్‌’ 3 రోజెస్‌’. ప్రముఖ దర్శకుడు మారుతి షో రన్నర్‌గా వ్యవహరిస్తు్నారు. రీతూ – జాన్వీ – ఇందు అనే ముగ్గురు అమ్మాయిల జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ఉండనుందని ఇటీవల విడుదలైన టీజర్ చూస్తే అర్ధమవుతుంది. ఈ ఆసక్తికరమైన వెబ్‌సిరీస్‌ నవంబర్‌ 12 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది.

జీ5(నవంబర్‌12)
అరుణ్మణై 3 (తమిళం)
స్వ్కాడ్‌ (హిందీ)

డిస్నీ + హాట్‌స్టార్‌ (నవంబర్‌12)
డోప్‌ సిక్‌ (వెబ్‌ సిరీస్‌)
స్పెషల్‌ ఆప్స్‌(వెబ్‌సిరీస్‌)
కనకం కామిని కలహం(మలయాళం)
షాంగ్‌- చి (హాలీవుడ్‌)
హోమ్‌ స్వీట్‌ హోమ్‌ ఎలోన్‌ (హాలీవుడ్‌)
జంగిల్‌ క్రూయిజ్‌ (హాలీవుడ్‌)

నెట్‌ఫ్లిక్స్‌
రెడ్‌ నోటీస్‌ (హాలీవుడ్‌)- నవంబర్‌12

Also Read:

Puneet Rajkumar: పునీత్ రాజ్‌కుమార్ సంస్మరణ కార్యక్రమం.. నేత్రదాన శిబిరాలు నిర్వహిస్తున్న ఫ్యాన్స్

Puneeth Raj kumar Death: పునీత్ మరణం.. ప్రభుత్వాన్నే గడగడలాడించింది.. డైరెక్ట్ సీఎంనే రంగంలోకి దిగిన పరిణామాలు..(వీడియో)

Katrina Kaif: వేడుకగా కత్రినా, విక్కీల నిశ్చితార్థం.. డిసెంబర్‌లో పెళ్లి పీటలెక్కనున్న ప్రేమపక్షులు..?