వేసవి సెలవులు వచ్చేశాయి సినిమాల సందడి మొదలైంది. అటు వెండి తెరపై కొత్త సినిమాలు హల్చల్ చేస్తుంటే మరో వైపు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను పలకరించేందుకు కొత్త సినిమాలు ముస్తాబవుతున్నాయి. ఒకప్పుడు శుక్రవారం వచ్చిందటే థియేటర్లలో విడుదలయ్యే సినిమా కోసమే ఎదురు చూసేశారు. కానీ ఇప్పుడు ఓటీటీ మూవీస్ కూడా వీకెండ్స్‌లో సందడి చేస్తున్నాయి. ఈ వారం కూడా కొన్ని సినిమాలు ప్రేక్షకులకు పలకరించేందుకు ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నాయి. ఇంతకీ ఏంటా సినిమాలు.? ఏయే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో విడుదలువుతున్నాయో ఓ లుక్కేయండి..
* తొలి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా వేదికగా న్యూసెన్స్ వెబ్ సిరీస్ విడుదలకు సిద్ధంగా ఉంది. మే 12వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ మొదలు కానుంది. మీడియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్ ట్రైలర్‌తో అంచనాలు పెంచేసింది.
* సమంత హీరోయిన్‌గా నటించిన శాకుంతలం మూవీ మే 12 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా కోసం కూడా ప్రేక్షకులకు ఎదురు చూస్తున్నారు.
* ఈ వారం ఓటీటీలో సందడి చేస్తున్న మరో చిత్రం దహాద్. మే 12 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. హత్య కేసును చేధించే నేపథ్యంలో తెరక్కిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి.
* నెట్‌ఫ్లిక్స్ వేదికగా మే 12న పలు హాలీవుడ్ మూవీస్ విడుదలవుతున్నాయి. వీటిలో రాయల్ టీన్:ప్రిన్సెస్ మార్గరెట్, ఎరినీ, ది మదర్, క్రాటర్, బ్లాక్ నైట్ వంటి చిత్రాలు రానున్నాయి.
* అదితిరావు హైదరీ నటించిన తాజ్: ది రీన్ ఆఫ్ రివెంజ్ సిరీస్ మే12వ తేదీన జీ5లో స్ట్రీమింగ్ కానుంది.
* హాట్ స్టార్ వేదికగా ది మప్పెట్స్ మే హెట్ వెబ్ సిరీస్ మే10 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక స్వప్న సుందరి మూవీ మే 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
* ఇక ఈ వారం ప్రేక్షకులు ఎంతగానో మరో చిత్రం కూడా స్ట్రీమింగ్ కానుంది. హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన విక్రమ్ వేద (హిందీ) జియో సినిమా వేదికగా మే 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..