Bhupinder Singh: మరో లెజెండరీ సింగర్‌ మృతి.. తీవ్ర విషాదంలో సినీ ఇండస్ట్రీ..

|

Jul 19, 2022 | 11:14 AM

దాదాపు 5 దశాబ్ధాలుగా ఎన్నో మధుర గీతాలను ఆలపించి ప్రేక్షకలోకాన్ని అలరించిన ప్రముఖ బాలీవుడ్‌ సింగర్‌ భూపిందర్‌ సింగ్‌ (82) స్వర్గస్తులయ్యారు..

Bhupinder Singh: మరో లెజెండరీ సింగర్‌ మృతి.. తీవ్ర విషాదంలో సినీ ఇండస్ట్రీ..
Bhupinder Singh
Follow us on

Legendary singer Bhupinder Singh passed away: దాదాపు 5 దశాబ్ధాలుగా ఎన్నో మధుర గీతాలను ఆలపించి ప్రేక్షకలోకాన్ని అలరించిన ప్రముఖ బాలీవుడ్‌ సింగర్‌ భూపిందర్‌ సింగ్‌ (82) స్వర్గస్తులయ్యారు. యూరినరీ ఇన్ఫెక్షన్‌ కారణంగా ఆస్పత్రిలో చేరిన నేపథ్యంలో భూపిందర్​కు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్​ లక్షణాలు కన్పించాయి. దీనితోపాటు ఆయనకు పెద్ద పేగు క్యాన్సర్​కూడా ఉన్నట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం (జులై 18) రాత్రి పరిస్థితి విషమించి కన్నుమూసినట్లు ఆయన భార్య మితాలీ సింగ్‌ తెలిపారు. దీంతో దేశ సినీ పరిశ్రమ మరో లెజెండరీ సెంగర్‌ను కోల్పోయింది. సినీ ఇండస్ట్రీలో మహమ్మద్‌ రఫీ నుంచి, ఆర్‌డి బర్మన్, మదన్ మోహన్, లతా మంగేష్కర్‌, ఆశా భోంస్లే, గుల్జార్, బప్పి లహిరి వరకు ఎందరో గాన గంధర్వులతో కలిసి భూపిందర్‌ సింగ్‌ పనిచేశారు.

‘నామ్ గుమ్ జాయేగా’, ‘దిల్ ధూండతా హై’ వంటి క్లాసిక్‌లకు గజల్ గాయకుడిగా భూపిందర్ సింగ్ సుప్రసిస్ధుడు. తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ‘దో దివానే షెహర్ మే’, ‘ఏక్ అకేలా ఈజ్ షెహర్ మే’, ‘తోడి సి జమీన్ తోడా ఆస్మాన్’, ‘దునియా చూటే యార్ నా చూటే’, ‘కరోగే యాద్ తో’ వంటి ఎన్నో పాటలుపాడి దేశ వ్యాప్తంగా ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు.

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జన్మించిన భూపిందర్‌ సింగ్‌కు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన మొదట ఢిల్లీలోని ఆల్ ఇండియా రేడియోలో గాయకుడిగా తన వృత్తిని ప్రారంభించాడు. ఆల్ ఇండియా రేడియోలో స్వరకర్తగా ఉన్న మదన్ మోహన్ తొలుత భూపిందర్‌ సింగ్‌ టాలెంట్‌ను గుర్తించి ముంబైకి పిలిపించారు. 1964లో చేతన్ ఆనంద్ దర్శకత్వం వహించిన ‘హకీకత్’ తో భూపిందర్‌ గాన ప్రస్థానం ప్రారంభమైంది.అక్కడే మహమ్మద్ రఫీ, తలత్ మహమూద్, మన్నా డేతో కలిసి మోహన్-కంపోజ్ చేసిన ‘హోకే మజ్బూర్ ముఝే ఉస్నే బులాయా హోగా’ సాంగ్‌ను ఆలపించాడు. గాయని మితాలీని వివాహం చేసుకున్న తర్వాత 1980లో ప్లేబ్యాక్ సింగింగ్‌కు దూరమయ్యాడు. ప్లేబ్యాక్ సింగర్‌గానేకాకుండా ‘దమ్ మారో దమ్’, ‘చురా లియా హై’, ‘చింగారి కోయి భడ్కే’, ‘మెహబూబా ఓ మెహబూబా’ వంటి అనేక ప్రసిద్ధ ట్రాక్‌లలో గిటారిస్ట్‌గా కూడా పనిచేశారు.

ఇవి కూడా చదవండి

లెజెండరీ సింగర్‌ మృతి పట్ల దేశ ప్రధాని మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతోపాటు బాలీవుడు ప్రముఖులు సంతాపం తెలియజేశారు.