Prabhas: ప్రభాస్ చెరిష్మా రోజు రోజుకీ పెరిగిపోతోంది. తన సినిమాలతో అభిమానుల మనసు దోచుకున్న ఈయన.. తాజాగా అదే ఆటిట్యూడ్‌తో హీరోయిన్ల మనసు దోచేస్తున్నారు. టాలీవుడ్ కంటే ఎక్కువగా బాలీవుడ్‌లోనే ప్రభాస్ పేరు మార్మోగిపోతుంది. ఈయనతో నటించిన ప్రతి హీరోయిన్.. ప్రభాస్ మాయలో పడిపోతున్నారు. తాజాగా మరో భామ కూడా ప్రభాస్ భజన మొదలుపెట్టింది. నిజమే.. ఇప్పుడిదే జరుగుతుంది.. నిజంగానే ప్రభాస్ అంటే పడి చచ్చిపోతున్నారు బాలీవుడ్ హీరోయిన్లు. పదేళ్ళ కింద మిర్చి సినిమాలో కొరటాల శివ ఏం రాసారో.. ఇప్పుడదే జరుగుతుంది. ఏమున్నాడ్రా బాబూ అంటూ ఆ సిక్స్ ఫీట్ కటౌట్‌కు అంతా ఫిదా అయిపోతున్నారు. ప్రభాస్‌తో ఒక్కసారి నటిస్తే చాలు.. ఆయన మాయలో పడిపోతున్నారు హీరోయిన్లు. తాజాగా కృతి సనన్ కూడా ఈ లిస్టులో చేరిపోయారు.
ఆదిపురుష్‌లో ప్రభాస్‌కు జంటగా నటిస్తున్నారు కృతి. ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. ఇందులో రాముడిగా ప్రభాస్ నటిస్తుంటే.. సీతగా కనిపిస్తున్నారు కృతి సనన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. అంతా ఆయన తెచ్చే ఫుడ్ గురించి చెప్తారు కానీ ప్రభాస్‌లో అంతకు మించిన మ్యాజిక్ ఉంది. కెమెరా ముందు అతడి కళ్ళు చూస్తుంటే ఏదో మాయ కనిపిస్తుందంటూ కృతి కామెంట్ చేసారు. ప్రభాస్‌తో ఎన్ని సినిమాలైనా చేస్తానంటూ చెప్పుకొచ్చారు.
ప్రభాస్ ఫ్యాన్ గాల్ లిస్టులో ఇంకా చాలా మంది హీరోయిన్లున్నారు. గతంలో దీపిక పదుకొనే సైతం ప్రభాస్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ఈయన వ్యక్తిత్వానికి ఫిదా అయిపోతున్నట్లు తెలిపారు దీపిక. అలాగే దిశా పటానీ, కరీనా కపూర్, భాగ్య శ్రీ అయితే ప్రభాస్ ఫుడ్డుకు పడిపోయారు. ఈయన తెచ్చే ఫుడ్ కోసమే ఎన్నిసార్లైనా నటించొచ్చు అంటూ చమత్కరించారు కూడా. ఏదేమైనా తన కటౌట్‌తోనే కాదు.. వ్యక్తిత్వంతోనూ అందర్నీ అభిమానులుగా మార్చేసుకుంటున్నారు ప్రభాస్.
మరిన్ని సినిమా వార్తలు చదవండి