ఈడీ ముందుకు రియా: కృతి సనన్‌ సంచలన పోస్ట్‌

సుశాంత్‌ కేసులో నటి రియా చక్రవర్తిని ఈడీ అధికారులు శుక్రవారం విచారించిన విషయం తెలిసిందే. దాదాపు 7 గంటల పాటు ఆమెను ఈడీ అధికారులు విచారించారు.

ఈడీ ముందుకు రియా: కృతి సనన్‌ సంచలన పోస్ట్‌

Edited By:

Updated on: Aug 08, 2020 | 6:13 PM

Sushant Case Updates: సుశాంత్‌ కేసులో నటి రియా చక్రవర్తిని ఈడీ అధికారులు శుక్రవారం విచారించిన విషయం తెలిసిందే. దాదాపు 7 గంటల పాటు ఆమెను ఈడీ అధికారులు విచారించారు. అయితే ఈ విచారణలో నటి వారికి పెద్దగా సహకరించనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈడీ ముందుకు రియా హాజరైన నేపథ్యంలో సుశాంత్ ఫ్రెండ్, కోస్టార్ కృతి సనన్ కీలక పోస్ట్‌ని షేర్ చేశారు.

”మబ్బులు పట్టాయి. మంచు పరచుకొని ఉంది. దీని వల్ల అంతా స్పష్టంగా లేదు. కానీ నిజం అన్నది సూర్యుడి లాంటిది. అది ఎప్పుడు అక్కడే ఉంటుంది. దేన్ని ఊహించకండి. సహనంతో ఎదురుచూడండి. కాసేపు గాలి వీస్తూ ఉండొచ్చు. వర్షం కురవొచ్చు. కానీ కొన్ని సార్లు సూర్యుడు మళ్లీ ప్రకాశవంతం అయ్యేందుకు తుఫాను దారి ఇస్తుంది” అని కృతి పోస్ట్ చేశారు. మరోవైపు సుశాంత్‌ తల్లి ఫొటోను షేర్ చేసిన అతడి మాజీ ప్రేయసి అంకితా లోక్వాండే.. ”మీ ఇద్దరు ఒకే చోట ఉన్నారని నమ్ముతున్నా” అని కామెంట్ పెట్టారు.

Read This Story Also: యూట్యూబర్‌ని పెళ్లాడబోతున్న చాహల్‌