బాలయ్యతో ఛాన్స్ అలా మిస్సయ్యా: మంజుల

| Edited By:

Jul 24, 2019 | 10:13 AM

నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు సీనియర్ నటుడు కృష్ణ తనయ, మహేష్ సోదరి మంజుల. అయితే హీరోయిన్‌గా ఆమెకు అప్పట్లో ఓ అవకాశం వచ్చిందట. బాలకృష్ణ హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘టాప్‌హీరో’లో మొదట హీరోయిన్‌గా మంజులనే అనుకున్నారట. అయితే ఈ విషయం తెలిసిన కృష్ణ ఫ్యాన్స్ ఆమె నటించేందుకు ఒప్పుకోలేదట. ఈ విషయాన్నిఆమె ఇటీవల ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. ‘‘టాప్ హీరోలో హీరోయిన్‌గా ఆఫర్ వచ్చింది. కానీ నేను […]

బాలయ్యతో ఛాన్స్ అలా మిస్సయ్యా: మంజుల
Follow us on

నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు సీనియర్ నటుడు కృష్ణ తనయ, మహేష్ సోదరి మంజుల. అయితే హీరోయిన్‌గా ఆమెకు అప్పట్లో ఓ అవకాశం వచ్చిందట. బాలకృష్ణ హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘టాప్‌హీరో’లో మొదట హీరోయిన్‌గా మంజులనే అనుకున్నారట. అయితే ఈ విషయం తెలిసిన కృష్ణ ఫ్యాన్స్ ఆమె నటించేందుకు ఒప్పుకోలేదట. ఈ విషయాన్నిఆమె ఇటీవల ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది.

‘‘టాప్ హీరోలో హీరోయిన్‌గా ఆఫర్ వచ్చింది. కానీ నేను సినిమాల్లో నటించడానికి నాన్నగారి అభిమానులు అస్సలు ఒప్పుకోలేదు. నల్ల ముసుగులు వేసుకొని, పెట్రోల్ క్యానులు పట్టుకొని స్టూడియో ముందు వచ్చి నిరసన తెలిపారు. మంజుల నటిస్తే తగలబెట్టుకొని చచ్చిపోతాం అని గొడవ చేశారు. నేను నటించనని నాన్న గారు ప్రకటన ఇచ్చేవరకు వాళ్లు ఒప్పుకోలేదు. నేను వాళ్ల సోదరినని, ఇంటి ఆడపడుచునని అనుకొని నటించడానికి ఒప్పుకోలేదంతే. అంతకుమించి ఏమీ లేదు’’ అని మంజుల చెప్పుకొచ్చింది. కాగా ‘పోకిరి’, ‘ఏమాయా చేసావే’ వంటి చిత్రాలకు సహనిర్మాతగా వ్యవహరించిన మంజుల.. ‘మనసుకు నచ్చింది’ చిత్రంతో దర్శకురాలిగా మారింది. ‘షో’, ‘కావ్యాస్ డైరీ’, ‘ఆరంజ్’, ‘సేవకుడు’ వంటి చిత్రాల్లోనూ ఆమె నటించిన విషయం తెలిసిందే.