Varanasi: రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదుగా.. హనుమంతుడిగా మరో స్టార్ హీరో! ఎవరో తెలుసా?

ఎస్​.ఎస్. రాజమౌళి డైరెక్షన్లో రూపొందుతున్న ‘వారణాసి’ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. మైథలాజికల్​ టచ్​తో రూపొందుతున్న ఈ సినిమాలో సూపర్​స్టార్​ మహేష్​బాబు రాముడిగా కనిపించనుండగా,​ బాలీవుడ్​ స్టార్ హీరోయిన్​ ప్రియాంక చోప్రాజోనస్​ మందాకినిగా నటిస్తున్నారు. రాజమౌళి తన సినిమాలో దాదాపు అన్ని క్యారెక్టర్లకు స్టార్లనే ఎంపిక చేస్తారనే ..

Varanasi: రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదుగా.. హనుమంతుడిగా మరో స్టార్ హీరో! ఎవరో తెలుసా?
Maheshbabu & Silhoutte

Updated on: Nov 21, 2025 | 10:37 AM

ఎస్​.ఎస్. రాజమౌళి డైరెక్షన్లో రూపొందుతున్న ‘వారణాసి’ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. మైథలాజికల్​ టచ్​తో రూపొందుతున్న ఈ సినిమాలో సూపర్​స్టార్​ మహేష్​బాబు రాముడిగా కనిపించనుండగా,​ బాలీవుడ్​ స్టార్ హీరోయిన్​ ప్రియాంక చోప్రాజోనస్​ మందాకినిగా కనిపించనున్నారు.

మాలీవుడ్​ స్టార్​ పృథ్వీరాజ్​ సుకుమారన్​ విలన్​గా కుంభ పాత్రలో అలరించనున్నారు. రాజమౌళి తన సినిమాలో దాదాపు అన్ని క్యారెక్టర్లకు స్టార్లనే ఎంపిక చేస్తారనే విషయం తెలిసిందే. అయితే హనుమంతుడిగా ఎవరు కనిపించబోతున్నారనే విషయంపై ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. హనుమంతుడి పాత్రలో కోలీవుడ్ నుంచి ఒక సూపర్ స్టార్ హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నారట!

వారణాసి సినిమాను పాన్​ఇండియా రేంజ్​లో తీస్తున్న రాజమౌళి నటీనటులను కూడా ఆ రేంజ్‌లోనే క్యాస్టింగ్ చేశారు. హనుమంతుడి పాత్రకు ఎంతో భక్తి భావం, శక్తి, ఇమోషన్స్ కావాలి. ఆ క్యారెక్టర్‌కి పర్ఫెక్ట్ ఫిట్ అయ్యేలా కోలీవుడ్ నుంచి ఒక టాప్ హీరోని లాక్ చేశారట. ఇప్పటికే షూటింగ్‌లో ఆ హీరో సీన్స్ కూడా కంప్లీట్ అయినట్టు సమాచారం. రాముడు-హనుమంతుడి బంధం సినిమాలో సెంట్రల్ థీమ్ కాబోతోందని టాక్​. కోలీవుడ్‌లోనూ, బాలీవుడ్‌లోనూ సూపర్ హిట్స్ ఇచ్చిన ఆర్​ మాధవన్​ ఇప్పుడు రాజమౌళి మాయలో హనుమంతుడిగా అవతరించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో మహేష్ బాబు రాముడి క్యారెక్టర్‌లో కనిపిస్తారు. రాజమౌళి గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌లో ఇది ఆఫీషియల్‌గా కన్ఫర్మ్ చేశారు. వారాణసి ఘాట్‌ల సీన్ ఇప్పటికే పూర్తి అయింది, మహేష్ ఆ రూపంలో అద్భుతంగా కనిపిస్తున్నారట. మాధవన్ మహేష్ తండ్రి పాత్రలో నటిస్తున్నారని వార్తలు వచ్చాయి కానీ ఆయన హనుమంతుడి పాత్రలో కనిపించనున్నారని టాక్​ వినిపిస్తోంది. ఈ చేంజ్ ఫ్యాన్స్‌లో ఎక్సైట్‌మెంట్ పెంచింది. మాధవన్ యొక్క ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్, డెవోషనల్ ఎక్స్‌ప్రెషన్స్ ఈ పాత్రకు పర్ఫెక్ట్ మ్యాచ్ అని అంచనా. రాజమౌళి ఈ ప్రాజెక్ట్‌ను ప్రెస్టీజియస్‌గా చూస్తూ, ప్రతి ఇండస్ట్రీ నుంచి ఒక స్టార్‌ని జోడించారు.

Madhavan

కథలో రామాయణ ఇతిహాసం ఇన్‌ఫ్లుయెన్స్ స్పష్టంగా కనిపిస్తుంది. రాముడు-హనుమంతుడి బంధం సెంట్రల్ థీమ్​గా, చిన్నమస్తా దేవి వంటి దైవిక ఎలిమెంట్స్ జోడించి ట్విస్ట్ ఇచ్చారు. హనుమంతుడు రామ భక్తుడిగా, శక్తి స్వరూపంగా హిందువులకు ఆరాధ్యదైవం. అలాంటి శక్తివంతమైన పాత్రలో మాధవన్​ చక్కగా సరిపోతారని భావిస్తున్నారు సినీఅభిమానులు. అంతేకాదు, వారణాసి సినిమా నుంచి వచ్చే అన్ని సోషల్​ మీడియా పోస్ట్​లకు మాధవన్​ స్పందించడం ఈ వార్తలకు మరింత బలాన్నిస్తుంది. రాముడిగా మహేష్​, హనుమంతుడిగా మాధవన్​ ఎలా మెప్పిస్తారో చూడాలి మరి!

Follow Us