Simbu: ఇబ్బందులకు గురిచేస్తున్నారు.. అభిమానులే నన్ను చూసుకోవాలి.. శింబు భావోద్వేగం..

|

Nov 19, 2021 | 8:18 AM

తమిళ నటుడు శింబు హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'మానాడు'. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. వెంకట్‌ ప్రభు దర్శకుడు..

Simbu: ఇబ్బందులకు గురిచేస్తున్నారు.. అభిమానులే నన్ను చూసుకోవాలి.. శింబు భావోద్వేగం..
Follow us on

తమిళ నటుడు శింబు హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘మానాడు’. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. వెంకట్‌ ప్రభు దర్శకుడు. కల్యాణి ప్రియదర్శన్‌, ఎస్‌ జే సూర్య తదితర ప్రముఖులు నటిస్తున్నారు. యువ సంగీత దర్శకుడు యువన్‌ శంకర్‌ రాజా సంగీత సారథ్యం వహించారు. ఈనెల 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం చెన్నైలో ఆడియో వేడుకను నిర్వహించింది. ఈ సందర్భంగా మాట్లాడిన శింబు ప్రసంగం మధ్యలో భావోద్వేగానికి లోనయ్యాడు. వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్నాడు.

సినిమా కోసం ఎంతో శ్రమించాం..
‘నేను, వెంకట్‌ ప్రభు కలిసి ఎప్పటి నుంచో ఈ సినిమా చేయాలనుకుంటున్నాం. కానీ సమయం కుదరలేదు. ‘మానాడు’ లైన్‌ నాకు బాగా నచ్చింది. వెంటనే ఓకే చెప్పేశాను. ఈ సినిమా కోసం నేను ఎంతో కష్టపడ్డాను. నేనే కాదు సినిమా బాగా రావడానికి చిత్రబృందమంతా ఎంతో శ్రమించింది. ఎస్‌ జే సూర్య అద్భుతంగా నటించారు. ఈ సినిమా విడుదలయ్యాక ఆయన స్థాయి మరింత పెరుగుతుంది. ఇక యువన్‌ నాకు లక్కీ హ్యాండ్. మరోసారి ఆయన నాకు మంచి మ్యూజిక్‌ ఇచ్చాడు. అయితే ఇటీవల కొందరు నాకు సమస్యలు సృష్టిస్తున్నారు. బాగా ఇబ్బంది పెడుతున్నారు. వాటన్నింటినీ నేను చూసుకోగలను. కానీ నన్ను మాత్రం మీరే (అభిమానులు) చూసుకోవాలి’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు శింబు. దీంతో వేదికపై నున్న అతిథులు అతనిని ఓదార్చారు. టైమ్‌ లూప్‌ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది.Also Read:

Urfi Javed : బిగ్‌బాస్‌ నటి డ్రస్‌పై నెటిజన్ల విసుర్లు.. వార్డ్‌రోబ్‌ కలెక్షన్‌ చెత్తగా ఉందని ట్రోలింగ్‌..

Bigg Boss 5 Telugu: రెచ్చిపోతున్నారు.. హద్దుమీరుతున్నారు.. ఆ ఇద్దరి పై నెటిజన్స్ ఫైర్.. కారణం ఇదే..

Most Eligible Bachelor: ఆహా అందిస్తున్న అందమైన ప్రేమకథ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌’.. ఓటీటీకి వచ్చేసిన సినిమా