
సినీరంగంలో విజయం సాధించడం అంత సులభమైన విషయమేమి కాదు. ఎన్నో సవాళ్లు.. అడ్డంకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారందరూ ఒకప్పుడు ఎంతో కష్టపడినవారే. ఈ క్రమంలోనే తాజాగా ఓ హీరో గురించి ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుంది. అతడు మరెవరో కాదు.. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్. ప్రస్తుతం అతడి వయసు 58 సంవత్సరాలు. ఇప్పటికీ ఫిట్నెస్ విషయంలో, సినిమాల విషయంలో కుర్ర హీరోలకు గట్టిపోటీ ఇస్తున్నారు. ప్రతి సంవత్సరం అక్షయ్ కుమార్ అనేక హిట్ చిత్రాల్లో నటిస్తుంటారు. అయితే ఇప్పుడు అక్షయ్ కుమార్ అంటే కోట్లాది రూపాయల సంపాదన, విలాసవంతమైన జీవనశైలి, అపారమైన క్రేజ్ మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ వీటన్నింటి వెనుక ఎన్నో సంవత్సరాల పోరాటం, వైఫల్యాలు, కఠోర శ్రమ ఉన్నాయి. ఒకప్పుడు అక్షయ్ కుమార్ వెయిటర్ గా పనిచేశారు. వెయిటర్‌గా పనిచేయడం నుండి పాస్‌పోర్ట్ కార్యాలయంలో ఉద్యోగిగా చేరడం వరకు, ఆయన తన కలలను సాకారం చేసుకునే ప్రయత్నం కొనసాగించారు. ఒక ఇంటర్వ్యూలో తన తొలి రోజులను గుర్తుచేసుకున్నారు.
“నేను ఈ పరిశ్రమలోకి వచ్చినప్పుడు నా జేబులో 200 రూపాయలు కూడా లేవు. ఈ రోజు నా దగ్గర చాలా ఉంది.” అని అన్నారు. అక్షయ్ కుమార్ ఈ స్థాయికి చేరుకోవడానికి ప్రయాణం ఏమాత్రం సులభం కాదు. అతను ఏడవ తరగతిలోనే చదువులో విఫలమయ్యాడు. దురదృష్టవశాత్తు అదే సమయంలో అతని తండ్రికి క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. తన కుటుంబ పరిస్థితి కారణంగా అక్షయ్ అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. అక్షయ్ తన కాళ్ళ మీద తాను నిలబడటానికి చాలా కష్టపడ్డాడు. అతను బ్యాంకాక్‌లో వెయిటర్‌గా పనిచేశాడు. అంతేకాకుండా, అతను పాస్‌పోర్ట్ కార్యాలయంలో పనిచేశాడు. ఒక ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్‌కు సహాయకుడిగా ఉంటూ మోడలింగ్ ప్రపంచంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు.
బాలీవుడ్‌లో పేరు సంపాదించుకున్న తర్వాత కూడా అక్షయ్ పోరాటం ముగియలేదు. అతని కెరీర్‌లో వరుసగా 14 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి, కానీ అక్షయ్ వదులుకోలేదు. ఇప్పుడు అతడు అతను పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకడు. ఢిల్లీలోని చాందినీ చౌక్ నుండి ముంబైకి మారిన తర్వాత, తమ కుటుంబం సియోన్ కోలివాడ ప్రాంతంలోని ఒక చిన్న ఇంట్లో నివసించిందని గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు అక్షయ్ కుమార్. చాందినీ చౌక్‌లోని ఒక ఇంట్లో 24 మందిమి ఉండేవాళ్ళమని.. అందరూ ఒకే గదిలో పడుకునేవాళ్ళం. ఉదయాన్నే వ్యాయామం కోసం నిద్రలేచినప్పుడు, బయటకు వెళ్లడానికి ఒకరిపై ఒకరు దూకుకుంటూ వెళ్లాల్సి వచ్చేదని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు అతడి ఆస్తులు రూ.2400 కోట్లకు పైగానే ఉంటుంది.
ఎక్కువ మంది చదివినవి : Vikram Chiyaan : ఆ హీరోయిన్ దేవత.. చాలా మిస్ అవుతున్నాను.. హీరో విక్రమ్ కామెంట్స్..
ఎక్కువ మంది చదివినవి : OTT Cinema : అడవిలో అమ్మాయి మరణం.. ఓటీటీని అల్లాడిస్తున్న థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు..