నటుడిగా మారిన సంచలన దర్శకుడు.. హీరోయిన్‌గా కీర్తి

మహానటి కీర్తి సురేష్ తమిళ్‌లో మరో చిత్రానికి ఓకే చెప్పింది. అరుణ్‌ మాతేశ్వరన్‌ దర్శకత్వంలో 'సానీ కాయితమ్'‌ అనే చిత్రంలో కీర్తి నటించనుంది.

నటుడిగా మారిన సంచలన దర్శకుడు.. హీరోయిన్‌గా కీర్తి

Edited By:

Updated on: Aug 16, 2020 | 4:31 PM

Keerthy Suresh next film: మహానటి కీర్తి సురేష్ తమిళ్‌లో మరో చిత్రానికి ఓకే చెప్పింది. అరుణ్‌ మాతేశ్వరన్‌ దర్శకత్వంలో ‘సానీ కాయితమ్’‌ అనే చిత్రంలో కీర్తి నటించనుంది. ఇక ఈ మూవీ కోసం నటుడిగా మారారు సంచలన దర్శకుడు, ధనుష్ సోదరుడు సెల్వ రాఘవన్‌. వీరిద్దరికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ తాజాగా విడుదల అయ్యింది. అందులో వీరిద్దరు గ్రామీణ లుక్‌లో కనిపిస్తుండగా.. కీర్తి చేతిలో గన్‌, సెల్వ చేతిలో కత్తి ఉంది. వీరి ముందు ఓ వాహనం రక్తంతో నిండి ఉండగా, ఆ వెనుకాల మరికొంత మంది ఉన్నారు. చూస్తుంటే ఈ చిత్రం రివేంజ్ డ్రామాగా తెరకెక్కబోతున్నట్లు అర్థమవుతోంది. ఇక 1980లో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని స్క్రీన్ సీన్‌ నిర్మించనుంది. ఇదిలా ఉంటే కీర్తి సురేష్ నటించిన గుడ్‌లక్ సఖి టీజర్‌ శనివారం విడుదల అవ్వగా.. అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

Read More:

ఆటలోనే కాదు మాటల్లోనూ మంత్రముంది

రూ.4.60 కోట్లకు అమ్ముడుపోయిన మైఖేల్ ‘బూట్లు’…